చెరువులో దూకి యువకుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

చెరువులో దూకి యువకుడి ఆత్మహత్య

Apr 2 2026 12:12 PM | Updated on Apr 2 2026 12:12 PM

బైక్‌, సెల్‌ఫోన్‌ కొనివ్వాలని

తల్లిదండ్రులతో గొడవ

డబ్బులు లేవని చెప్పడంతో అఘాయిత్యం

షాద్‌నగర్‌ రూరల్‌: బైక్‌, సెల్‌ఫోన్‌ కొనివ్వడంలేదని తల్లితండ్రులతో గొడవ పడిన ఓ యువకుడు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఫరూఖ్‌నగర్‌ మండలం కిషన్‌నగర్‌ శివారులో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన ఎల్లంపల్లి నర్సమ్మ, జంగయ్య దంపతుల కుమారుడు, అవివాహితుడు ఎల్లంపల్లి పవన్‌కుమార్‌(27) ఇంటి వద్దే ఖాళీగా ఉంటున్నాడు. పవన్‌కుమార్‌ తన ఖర్చులకోసం డబ్బులు కావాలని తరచూ తల్లితండ్రులతో గొడ వ పడేవాడు. ఈ నేపథ్యంలో బైక్‌, సెల్‌ఫోన్‌ కొనివ్వాలని మంగళవారం రాత్రి గొడవ చేశాడు. కూలీ నాలీ చేసి కుటుంబాన్ని నడుపుతున్నామని, మా దగ్గర డబ్బులు లేవని తల్లితండ్రులు చెప్పడంతో పవన్‌కుమార్‌ ఇంట్లోనుంచి వెళ్లిపోయాడు. అదేరోజు రాత్రి గ్రామ సమీపంలోని బండ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం సాయంత్రం పవన్‌కుమార్‌ మృతదేహం చెరువులో తేలిందని సమాచారం అందడంతో ఎస్‌ఐ రాంచందర్‌ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోస్టుమార్టం నిమి త్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడి తండ్రి జంగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్‌ఐ గోపాల్‌ తెలిపారు.

తల్లడిల్లిన తల్లి హృదయం..

కూతురు పెళ్లి చేయగా ఉన్న ఒక్కగానొక్క కుమారుడిపై తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తమతో గొడవ పడిన కొడుకు బయటకు వెళ్లిపోవడంతో తల్లి నర్సమ్మ రాత్రంతా గ్రామంలో వెతికింది. చీకటి పడినా కొడుకు రాకపోవడంతో బుధ వారం ఉదయం బావులు, చెరువుల వద్ద రోదిస్తూ వెతకసాగింది. గ్రామ సమీపంలోని బండ చెరువు కట్టపై వెళ్తున్న ఆమెకు నీటిలో తేలిన కొడుకు మృతదేహం కనిపించడంతో గుండెలు బాదుకుంది. ఆమె రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement