రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా వ్యవహరిస్తోందని కాళ్లాపూర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ చైర్మన్ విశారదన్ మహరాజ్ ఆరోపించారు. బుధవారం మండలంలోని రాపోల్, కాళ్లాపూర్ గ్రామాల్లో రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు. రైతులు కోల్పోయే భూములను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా భూ సేకరణకు నోటిఫికేషన్ ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించారు. రైతులకు న్యాయం చేయాలని చూస్తే సహించేది లేదన్నారు.


