ఖైదీలకు వైద్యం అభినందనీయం | - | Sakshi
Sakshi News home page

ఖైదీలకు వైద్యం అభినందనీయం

Apr 2 2026 12:06 PM | Updated on Apr 2 2026 12:06 PM

జైలు సూపరింటెండెంట్‌ రాజ్‌కుమార్‌

పరిగి: ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం ముద్దాయిలు, ఖైదీలు, సిబ్బందికి ఉచిత వైద్యం అందించడం అభినందనీయమని జైలు సూపరింటెండెంట్‌ రాజ్‌కుమార్‌ అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా బుధవారం పరిగి సబ్‌జైలులో శ్రీ సాయి డెంటల్‌ ఆస్పత్రి, కళాశాల వికారాబాద్‌ వారి సహకారంతో ఖైదీలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖైదీల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హాస్పిటల్‌ పీఆర్‌ఓ రవీందర్‌గౌడ్‌, వైద్యులు వివేక్‌, విశ్వప్రియ, కేజీయా, గాయత్రిదేవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement