రైతులకు రుణాలు ఇచ్చి సహకరించండి | - | Sakshi
Sakshi News home page

రైతులకు రుణాలు ఇచ్చి సహకరించండి

Mar 31 2026 10:38 AM | Updated on Mar 31 2026 10:38 AM

రికవరీ చేసి సహకార సంఘానికి న్యాయం చేయండి

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ఎలుగంటి మధుసూదన్‌రెడ్డి

షాబాద్‌: రైతులకు వ్యవసాయ సీజన్‌ల్లో రుణాలు ఇచ్చి వారి పెట్టుబడికి చేదోడు వాదోడుగా ఉండాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఎలుగంటి మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలోని సహకార సంఘం సర్వసభ్య సమావేశానికి సంఘం ప్రత్యేక అధికారి ప్రవీణ్‌కుమార్‌తో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఇచ్చిన రుణాలను సకాలంలో రికవరీ చేసి సంఘం అభివృద్ధికి సహకరించాలన్నారు. సహకార సంఘాల బలోపేతానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. రైతులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించి వడ్డీ రాయితీ పొందాలని సూచించారు. సంఘం ప్రత్యేక అధికారి మాట్లాడుతూ.. మండల రైతులు అన్ని రకాలుగా సంఘానికి ఉపయోగపడుతున్నారని, రుణాల రికవరీ విషయంలో కొంత నిదానంగా ఉన్నారన్నారు. సహకార సంఘం సీఈఓ శివకుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ సంవత్సరం 1400 మంది రైతులకు అధిక రుణాలు అందించిన్నట్లు చెప్పారు. 828 మంది రైతులకు స్వల్పకాలిక రుణాలు ఇచ్చామన్నారు. మొత్తం 51 శాతం వరకు రుణాలు ఇచ్చామని, 45 శాతానికిౖ పెగా రికవరీ చేశామన్నారు. మరో నెల రోజుల్లో మరికొంత రికవరీ జరుగుతుందని హామీనిచ్చారు. కార్యక్రమంలో సీఈఓ శివకుమార్‌రెడ్డి, సర్ధార్‌నగర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పీసరి సురేందర్‌రెడ్డి, గుడిమల్కాపూర్‌ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ కావలి చంద్రశేఖర్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ సంజీవరెడ్డి, సర్పంచులు అశోక్‌, ప్రభాకర్‌రెడ్డి, చెన్నయ్య, మహేందర్‌గౌడ్‌, తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement