న్యాయవ్యవస్థపై నమ్మకం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

న్యాయవ్యవస్థపై నమ్మకం పెంచాలి

Mar 31 2026 10:38 AM | Updated on Mar 31 2026 10:38 AM

● న్యాయమూర్తి బృంగి శ్రీనివాసులు ● చేవెళ్ల కోర్టులో బార్‌ పాలకవర్గ ప్రమాణ స్వీకారం

చేవెళ్ల: న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెంచేలా పనిచేయాలని చేవెళ్ల ఏడీజే కోర్టు జిల్లా అదనపు న్యాయమూర్తి బృంగి శ్రీనివాసులు, సీనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయమూర్తి దశరథ రామయ్య, జూనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయమూర్తి వియకుమర్‌ ఉపాధ్యాయ బార్‌ అసోసియేషన్‌ నూతన పాలకవర్గానికి సూచించారు. స్థానిక కోర్టు ఆవరణలో సోమవారం బార్‌ అసోసియేషన్‌ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరైన న్యాయమూర్తులు మాట్లాడుతూ.. కక్షిదారులకు స్వతర, ఖచ్చితమైన న్యాయ సేవలు అందించడానికి కృషిచేయాలన్నారు. సీనియర్‌ న్యాయవాది రాంరెడ్డి మాట్లాడుతూ.. చేవెళ్ల కోర్టుకు జిల్లాలో ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. బార్‌ అధ్యక్షుడు పాటి మధుసూదన్‌రెడ్డితో పాటు పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎన్‌.చంద్రశేఖర్‌, ఎన్‌,మాధురి, ప్రధాన కార్యదర్శి పి.మల్లేశ్‌యాదవ్‌, జాయింట్‌ సెక్రటరీ ఈ.రవీందర్‌రెడ్డి, ట్రెజరర్‌ జనార్దన్‌, స్పోర్ట్స్‌ అండ్‌ కల్చరర్‌ సెక్రటరీ ఎ.ప్రభాకర్‌రెడ్డి, లైబ్రేరియన్‌ టి.మహేశ్‌, ఇ.కవిత, ఎగ్టిక్యూటివ్‌ కమిటీ సభ్యులు మహేశ్‌, సుదర్శన్‌, ఆనంద్‌, ప్రవీణ్‌రెడ్డి, మనీషారెడ్డి, కె. ప్రవీణ, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement