అబ్దుల్లాపూర్‌మెట్: అతివేగంగా వాహనాలు నడుపుతున్న యువత ప్రమాదాల్లో ప్రాణా లు కోల్పోతున్నారని డీజీపీ శివధర్‌రెడ్డి అన్నారు. గుంతపల్లిలోని అవంతి విద్యాసంస్థల ఆవరణలో సోమవారం ‘యుఫోరియా 2026’ పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన కళాశాల చైర్మన్ శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ నందీష్, జనరల్ సెక్రటరీ డాక్టర్ ఎం.ప్రియాంక, ఎండీ శ్రవణ్ కుమార్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. జేఎన్‌టీయూ డైరెక్టర్ డాక్టర్ ఆర్.శ్రీదేవి, విర్చుసా క్యాంపస్ లీడ్ అభిషేక్ దోయిజోడే, ప్రొఫెసర్ టీవీ నారాయణ, కళాశాల డైరెక్టర్ జయప్రద, శేషతల్పసాయి, ఉమాపతిరెడ్డి, రాజ్‌కమల్, షేక్ అజ్మల్ హుస్సేన్ పాల్గొన్నారు.


