మొయినాబాద్‌రూరల్: గ్రామాల అభివృద్ధికి వార్డు సభ్యులందరూ సర్పంచ్, ఉపసర్పంచ్‌తో పాటు అధికారులతో కలిసి కృషి చేయాలని ఎంపీడీఓ సంధ్య, ఎంపీఓ వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం మొయినాబాద్ రైతు వేదికలో వార్డుసభ్యుల శిక్షణ ముగింపు సమావేశంలో ఆమె వారు పాల్గొని వార్డుసభ్యులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఐదు రోజులుగా మండలంలోని తొమ్మిది గ్రామాలకు చెందిన 80 మంది వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు నిర్వహించినట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధిపై వారికి క్షుణ్ణంగా అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్యదర్శులు, వార్డుసభ్యులు, ఉపసర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.


