మీటర్‌ సేల్స్‌ పెంపే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

మీటర్‌ సేల్స్‌ పెంపే లక్ష్యం

Mar 31 2026 10:38 AM | Updated on Mar 31 2026 10:38 AM

సీనియర్‌ సీఈలతో పర్చేజింగ్‌ కమిటీ ఏర్పాటు అవినీతికి ఆస్కారం లేకుండా అన్ని సేవలు ఆన్‌లైన్‌లోనే టీజీఎస్పీడీసీఎల్‌ సీఎండీ జితేష్‌ వి.పాటిల్‌

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘డిస్కంలో మీటర్ల కొరత ఉన్నమాట వాస్తవమే. కరెంట్‌ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని, స్టకప్‌, బర్‌డ్డన్‌ మీటర్లను మార్చాల్సిందిగా కోరుతూ వినియోగదారుల నుంచి అనేక విజ్ఞప్తులు వస్తున్నాయి. కొత్త కనెక్షన్ల జారీ సహా పాడైన మీటర్లను మార్చేందు ప్రత్యేక చర్యలు చేపట్టాం. విద్యుత్‌ పరికరాల కొనుగోళ్లలో భాగంగా మీటర్ల సమీకరణకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం. పారదర్శకతకు పెద్దపీటవేస్తున్నాం. ఇందుకు సీనియర్‌ సీఈలతో ఓ కమిటీని ఏర్పాటు చేశాం’ అని దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ సీఎండీ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. ఈ మేరకు సోమవారం టీజీఎస్పీడీసీఎల్‌ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌లో భాగంగా ఇప్పటికే 58 కొత్త సబ్‌స్టేషన్లు(33/11 కేవీ) సహా 57 ఫీడర్లు (33 కేవీ) ఏర్పాటు చేశాం. 119 పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంచాం. అదనంగా మరో 442 ఫీడర్లు(11కేవీ) సహా మరో 3,262 డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేసుకున్నాం. లైన్లకు అడ్డుగా ఉన్న చెట్లకొమ్మలను తొలగించాం. ఏదైనా సాంకేతిక సమస్యతో కరెంట్‌ సరఫరా నిలిచిపోతే.. వెంటనే సరఫరాను పునరుద్ధరించేందుకు ప్రత్యేక బృందాలను కూడా సిద్ధం చేసుకున్నాం.

సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే..

కొత్త కనెక్షన్ల జారీ, ప్యానల్‌బోర్డు, డీటీఆర్‌ల మంజూరు, వర్క్‌ ఎస్టిమేషన్లలో అక్రమ వసూళ్లకు పూర్తిగా చెక్‌పెట్టబోతున్నాం. వర్క్‌ ఎస్టిమేషన్‌ మొదలు.. కొత్త కనెక్షన్ల జారీ వరకు ఇలా అన్ని దరఖాస్తులను ఆన్‌లైన్‌లోనే స్వీకరిస్తాం. వర్క్‌ ఎస్టిమేషన్లలో ఒక యూనిఫాం విధానాన్ని తీసుకురాబోతున్నాం.

ఏఐతో నష్టాలకు చెక్‌..

అన్ని విభాగాల్లోనూ ఏఐ ఆధారిత సేవలను వినియోగించుకోబోతున్నాం. సబ్‌ స్టేషన్ల వారీగా గత మూడేళ్ల డేటాను విశ్లేషించబోతున్నాం. ప్రతీ డీటీఆర్‌ను ఏఐ తో అనుసంధానం చేయబోతున్నాం. విద్యుత్‌ నష్టాలకు కారణాలను గుర్తించడంతో పాటు భవిష్యత్తు డిమాండ్‌ను అంచనా వేసి, సబ్‌స్టేషన్లు, ఫీడర్లు, డీటీఆర్‌లను ఏర్పాటు చేయనున్నాం. అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవల కోసం మరో 260 ఆస్పత్రులతో అవగాహన ఒప్పందంకుదుర్చుకున్నాం. డిస్కం తాజా నిర్ణయంతో 8,229 మంది రిటైర్డ్‌, 20,261 సర్వీసు ఇంజనీర్లు లబ్ధిపొందే అవకాశం ఉంది. ప్రై వేటు మీటర్‌ రీడర్ల సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని నిర్ణయించాం.

పారదర్శకంగా విద్యుత్‌పరికరాల కొనుగోలు

పెరిగిన విద్యుత్‌ డిమాండ్‌

విద్యుత్‌ డిమాండ్‌ అనూహ్యంగా పెరుగుతోంది. ఎంత డిమాండ్‌ వచ్చినా.. తట్టుకుని సరఫరా చేసే సామర్థ్యం డిస్కంకు ఉంది. గతేడాది టీజీఎస్పీడీసీఎల్‌ పరిధిలో 11,017 మెగావాట్ల డిమాండ్‌ నమో దు కాగా, ఈ ఏడాది మార్చి 13న రికార్డు స్థాయిలో 11,318 మెగావాట్లు నమోదైంది. ఇక జీహెచ్‌ఎంసీ పరిధిలో గతేడా ది 4,352 మెగావాట్లు నమోదు కాగా, ఈ ఏ డాది మార్చి 3న 4,421 మెగావాట్లు రికార్డైంది. వచ్చే రోజుల్లో రోజు గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ ఐ దు వేల మెగావాట్లు దాటుతుందని అంచనా వే శాం. ఆ మేరకు ఏర్పాట్లు కూడా పూర్తి చేశాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement