యువకుడి అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

యువకుడి అదృశ్యం

Mar 31 2026 10:38 AM | Updated on Mar 31 2026 10:38 AM

షాబాద్‌: పెట్రోల్‌ పంపులో పనిచేయడానికి అని చెప్పి ఈనెల 26న ఇంటి నుంచి వెళ్లిన యువకుడు అదృశ్యమయ్యాడు. ఎస్‌ఐ రమేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సర్ధార్‌నగర్‌కు చెందిన కొమ్ము అక్షయ్‌ కుమార్‌ (18) నాలుగు నెలలుగా షాద్‌నగర్‌లోని ఓ పెట్రోల్‌ బంకులో కూలీగా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే ఈ నెల 26న పంపులోకి వెళ్తున్నానని చెప్పి, తిరిగి రాలేదు.

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

షాద్‌నగర్‌ రూరల్‌: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన సోమవారం షాద్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలోని చటాన్‌పల్లి శివారులో చోటు చేసుకుంది. ఎస్‌ఐ సుశీల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామ శివారులో గుర్తు తెలియని సుమారు (55) ఏళ్ల వయస్సు ఉన్న మృతదేహాన్ని గమనించిన గొర్రెల కాపరులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు భిక్షాటన చేస్తూ పరిసర ప్రాంతాల్లో నివసించే వ్యక్తి అయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి ఒంటిపై బూడిద రంగు చొక్కా, ఎర్ర రంగు అండర్‌వేర్‌ ఉన్నాయన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. ఆచూకీ తెలిస్తే షాద్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్‌ఐ తెలిపారు.

నీటి గుంతలో మృతదేహం

చేవెళ్ల: హస్తేపూర్‌ సమీపంలోని ఓ నీటి గుంతలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి.. నీటి గుంతలో శవాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని బయటకు తీయగా 30– 40 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తిగా గుర్తించారు. కుడి చేతిపై చిన్న పచ్చబొట్టు, చేతికి ఎరుపు రంగు దారం, మెడలో ఎరుపు దారంతో కూడిన రుద్రాక్ష, కుడి కాలిపై, నడుముపై నలుపు రంగు దారం కలిగి ఉన్నాయని తెలిపారు. ఎవరైనా గుర్తిస్తే సమాచారం అందించాలని సూచించారు.

బాలిక ఆత్మహత్య

బంజారాహిల్స్‌: తల్లి మందలించిందని ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. బంజారాహిల్స్‌ పోలీసులు తెలిపిన మేరకు.. బీహార్‌కు చెందిన ఉద్గర్‌ మండల్‌ కుటుంబం బంజారాహిల్స్‌ సయ్యద్‌నగర్‌లో నివాసముంటోంది. కూతురు దీపాకుమారి (14) ఎన్‌బీటీనగర్‌లోని శ్రీసాయిరాం హైస్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుకుంటోంది. కొంతకాలంగా చుట్టుపక్కల ఇళ్లకు తరచూ వెళుతుండటంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన బాలిక సోమవారం తెల్లవారుజామున తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

దివ్యాంగ యువతిపై లైంగికదాడి

అత్తాపూర్‌: ఇంట్లో ఎ వ్వరూ లేనిసమయంలో ఓ వ్యక్తి సమీప బంధువైన దివ్యాంగ యువతిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన అత్తాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. బార్కస్‌ చంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన మహమ్మద్‌ అఖీల్‌(35) మద్యానికి బానిస కావడంతో భార్య, ముగ్గురు పిల్లలు ఇతనికి దూరంగా ఉంటున్నారు. హసన్‌నగర్‌లో అఖీల్‌ సోదరి కుంటుంబం నివాసం ఉంటోంది. వారితోపాటు ఆడపడుచు (మూగ యువతి, దివ్యాంగురాలు) కూడా ఉంటోంది. ఇదిలా ఉండగా అఖీల్‌ తరచూ సోదరి ఇంటికి వచ్చేవాడు. ఈ నెల 28న ఉదయం 9 గంటల సమయంలో సోదరి కుటుంబసభ్యులందరూ బయటకువెళ్లగా యువతి మాత్రమే ఇంట్లోనే ఉంది. ఇది గమనించిన మహమ్మద్‌ అఖీల్‌ లోపలికి వెళ్లి ఆమైపె లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ తరువాత కుటుంబసభ్యులు రావడంతో క్షమించమని ప్రాధేయపడి పరారయ్యాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అత్తాపూర్‌ పోలీసులు రంగంలోకి దిగి 48 గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement