కొందుర్గు: ‘రోడ్డు వేయడానికి మేము అడ్డు చెప్ప డం లేదని.. కానీ మా భూములు లాక్కొని మా కు టుంబాలను రోడ్డున పడేయకండి సారూ’ అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రేడియల్ రోడ్డు–2 నిర్మాణంలో భాగంగా మంగళవారం మండలంలోని ముట్పూర్, ఉమ్మెంత్యాల, జిల్లేడ్ చౌదరిగూడ మండలంలోని లచ్చంపేటలో గ్రామసభలు ఏర్పా టు చేశారు. ఆయా సభలకు అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతు లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పచ్చని పంట పొలాల్లో నుంచి రోడ్లు వేస్తే తమ బతుకులు సాగేదె లా అని ప్రశ్నించారు. భూములకు బదులు భూము లు ఇవ్వాలని లేదంటే తాము ఎక్కడైనా భూములు కొనేందుకు వీలుగా బహిరంగ మార్కెట్‌లో పలుకుతున్న ధరలకు అనుగుణంగా పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల అభిప్రాయాలు రికార్డు చేసుకున్నామని, వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తామని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి తెలిపారు. రైతులకు న్యాయం జరిగేలా కృషిచేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో షాద్‌నగర్ ఆర్‌డీఓ సరిత, తహసీల్దార్లు అజాం అలీ, జగదీశ్వర్, డిప్యూటీ తహసీల్దార్ నివేదిత రెడ్డి, సర్వేయర్ ఆంజనేయులు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ దామోదర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు అంజయ్య, జ్యోతి పాల్గొన్నారు.
దేవాలయంలో ప్రత్యేక పూజలు
షాద్‌నగర్: పట్టణంలోని వేంకటేశ్వరస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం నిర్వహించిన శివపార్వతుల కల్యాణోత్సవానికి అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింలు, మున్సిపల్ చైర్మన్ బస్వం, నాయకులు కృష్ణ, పెంటయ్య, దామోదర్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, ఒగ్గు కిషోర్, పెద్ది రామ్మోహన్, కానుగు భూపాల్ తదితరులు పాల్గొన్నారు.


