కందుకూరు: మండల కేంద్రంలో 108 అంబులెన్స్ వాహనాన్ని మంగళవారం జిల్లా అంబులెన్స్ నిర్వహణాధికారి రాజాబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరుతో పాటు వారి పని తీరును పరిశీలించారు. ఆక్సిజన్ సరఫరా సక్రమంగా ఉందా లేదా అని పర్యవేక్షించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటు లో ఉంటూ అత్యవసర సమయంలో ఫోన్ వచ్చిన వెంటనే స్పందించి వారి వద్దకు చేరు కోవాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో 108 సిబ్బంది సురేందర్, షఫీ పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల్లో
నాణ్యత పాటించాలి
మంచాల: అభివృద్ధి పనుల నిర్వహణలో నాణ్యత పాటించాలని ఈఈ (పీఆర్) సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండలంలోని ఆరుట్ల, మంచాల గ్రామాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ పనులు, మంచాలలో స్కూల్ భవన నిర్మాణ పనులు, పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. అనంతరం మంచాల పంచాయతీ కార్యాలయం, ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం పనులు చేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎంవీ ప్రసాద్, ఎంపీడీఓ బాలశంకర్, ఎంపీఓ ఉమారాణి, ఆయా పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ భూమిలో
బోర్డు ఏర్పాటు
హయత్‌నగర్: అబ్దుల్లాపూర్‌మెట్టు మండలం మునుగనూరు సర్వే నంబర్ 44లోని ప్రభుత్వ భూమిలో మంగళవారం రెవెన్యూ అధికారులు బోర్డు ఏర్పాటు చేశారు. ఓ వ్యక్తి ప్రభుత్వ భూమిని ఆక్రమించి బోరు వేసి నిర్మాణం చేసేందుకు ప్రయత్నించడంతో సమాచారం అందుకున్న జీపీఓ సుప్రియ ఆక్రమణదారులను హెచ్చరించారు. అయినా వారు పనులను కొనసాగిస్తుండంతో బోర్డు ఏర్పాటు చేశారు. గ్రామంలో ప్రభుత్వ భూములను రక్షించేందుకు కట్టుబడి ఉన్నామని, ఎవరైనా ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
షాద్‌నగర్ చౌరస్తా
పరిశీలన
షాద్‌నగర్: పట్టణ చౌరస్తాను మంగళవారం హెచ్‌ఎండీఏ అధికారులు మున్సిపల్ చైర్మన్ అగ్గునూరు బస్వంతో కలిసి పరిశీలించారు. ఎక్కడి వరకు విస్తరించవచ్చు అన్న విషయంపై ఆరా తీశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్‌ఖాన్, కౌన్సిలర్లు అప్పి, పెంటయ్య, దిలీప్, నాయకులు ముబారక్, సాధిక్, మహబూబ్ తదితరులు ఉన్నారు.


