‘ప్రగతి ప్రణాళిక’ను పక్కాగా చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

‘ప్రగతి ప్రణాళిక’ను పక్కాగా చేపట్టాలి

Apr 1 2026 8:18 AM | Updated on Apr 1 2026 8:18 AM

కందుకూరు: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పనులను పకడ్బందీగా చేపట్టాలని డీఆర్‌డీఓ శ్రీలత ఆదేశించారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో మంగళవారం ఆమె పర్యటించారు. ముందుగా కొత్తూర్‌లోని నర్సరీ, ఈజీఎస్‌ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మీర్‌ఖాన్‌పేటలో ప్రభుత్వ భవనాలను సందర్శించి పలు సూచనలు చేశారు. నర్సరీ, పల్లె ప్రకృతి వనం, కంపోస్టు యాడ్‌, కమ్యూనిటీ ప్లాంటేషన్‌, అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ముచ్చర్లలోని అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు అందించే ఆహారాన్ని పరిశీలించారు. వెటర్నరీ, వైద్య ఆరోగ్యశాఖ సబ్‌ సెంటర్‌ భవనాలను సందర్శించి పనుల ప్రగతిని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రగతి ప్రణాళికలో భాగంగా పూర్తి చేయాల్సిన పనులను వేగవంతం చేయాలన్నారు. ఎలాంటి నిర్లక్ష్యం తగదన్నారు. ఆమె వెంట ఎంపీడీఓ సరిత, ఎంపీఓ గీత, ఏపీఓ రవీందర్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement