శాడిస్ట్ భర్త.. మద్యం మత్తులో భార్య, పిల్లలను నరికేసి.. | Druken Husband Wife Incident | Sakshi
Sakshi News home page

శాడిస్ట్ భర్త.. మద్యం మత్తులో భార్య, పిల్లలను నరికేసి..

Apr 1 2026 9:17 AM | Updated on Apr 1 2026 12:19 PM

Druken Husband Wife Incident

రంగారెడ్డి జిల్లా: కట్టుకున్న భార్యతోపాటు అభంశుభం తెలియని చిన్నారులపై ఓ వ్యక్తి మద్యం మత్తులో కర్కశంగా వ్యవహరించాడు. రోకలి, చాకుతో దాడి చేశాడు. భార్య, కుమారుడు మృతిచెందగా కూతురు మృత్యువుతో పోరాడుతోంది. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం సీతారాంనగర్‌ పంచాయతీలోని పులుగోనిపల్లితండాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తండాకు చెందిన బాణావత్‌ రాందాస్‌నాయక్‌ ఆమనగల్లులోని ఓ కాటన్‌మిల్లులో కారి్మకుడిగా పనిచేస్తున్నాడు. 

ఇతనికి భార్య కవిత, ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. కవిత కూలి పనికి వెళ్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేది. కూతుళ్లు పవిత్ర, పావని ఆమనగల్లులోని హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటుండగా కుమారుడు, చిన్న కూతురు తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు. కొన్నేళ్లుగా రాందాస్‌ నిత్యం మద్యం తాగి వచ్చి భార్యతో గొడవపడుతున్నాడు. స్థానిక పెద్దలు, పోలీసులు పలుమార్లు సర్దిచెప్పినా ఆయనలో మార్పు రాలేదు. సోమవారం రాత్రి అతిగా మద్యం తాగి ఇంటికి రావడంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. భార్య కవిత (32), కుమారుడు హర్ష(6), కూతురు ప్రణీతపై చాకు, రోకలితో దాడి చేశాడు.

 తీవ్రంగా గాయపడిన కవిత, హర్ష అక్కడికక్కడే మృతిచెందారు. ఇరుగుపొరుగు వారు సమాచారం అందించగా.. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ప్రణీతను హైదరాబాద్‌ ఉస్మానియా ఆస్పత్రికి, తల్లీకొడుకుల మృతదేహాలను పోస్టుమారా్టనికి తరలించారు. మహేశ్వరం ఏసీపీ జానకిరెడ్డి, ఆమనగల్లు ఎస్‌హెచ్‌ఓ వెంకటేశ్వర్లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడు రాందాస్‌ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement