గృహిణి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

గృహిణి ఆత్మహత్య

Dec 4 2025 9:06 AM | Updated on Dec 4 2025 9:06 AM

గృహిణ

గృహిణి ఆత్మహత్య

విద్యార్థి ఆత్మహత్య విద్యా, గృహ రుణాలకు ప్రాధాన్యత ఇవ్వాలి

మీర్‌పేట: గృహిణి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడ నూజివీడుకు చెందిన ఎం.సురేష్‌, శబరి (27)లు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. బతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం బడంగ్‌పేట సాయినగర్‌కు వచ్చి నివాసముంటున్నారు. శబరి గృహిణి కాగా, భర్త పహాడీషరీఫ్‌లోని స్కైరూట్‌ ఏరోస్పేస్‌ ఇన్ఫినిటీ క్యాంపస్‌లో పనిచేస్తున్నాడు. మంగళవారం భార్యాభర్తల మధ్య చిన్న తగాదా జరిగింది. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ

యాచారం: మెదక్‌లో ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు జరిగే సీఐటీయూ రాష్ట్ర మహా సభలకు సంబంధించి బుధవారం యాచారంలో వాల్‌ పోస్టర్లను ఆవిష్కరించారు. సీఐటీయూ మండల కన్వీనర్‌ చందునాయక్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్‌ హాజరై వాల్‌ పోస్టర్లను విడుదల చేశారు. సీఐటీయూ రాష్ట్ర మహా సభలకు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు హాజరు కావాలని పిలుపునిచ్చారు.

కుత్బుల్లాపూర్‌: పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి.. చదువుకో అన్నందుకు ఓ విద్యార్థి క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నాడు.పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు తెలిపిన మేరకు.. కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ భాగ్యలక్ష్మి కాలనీలో ఓం ప్రకాష్‌ , కమలాదేవి దంపతులు నివాసముంటున్నారు. పదవ తరగతి చదువుతున్న వీరి కుమారుడు రాజకుమార్‌ బిష్నోయి(14) బుధవారం సాయంత్రం ఇంటికి రాగానే గేమ్స్‌ ఆడేందుకు బటకు వెళ్తానని మారాం చేశాడు. దీంతో కుటుంబ సభ్యులు పరీక్షలు దగ్గర పడుతున్నాయి..చదువుకో అని చెప్పారు. దీంతో మనస్థాపానికి గురైన ఆ విద్యార్థి ఇంట్లోకి వెళ్లి గడియ పెట్టుకొని ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ వెంటనే సూరారం మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు వెల్లడించారు. పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరి వివరాలు సేకరించారు. మామ మనోహర్‌ రాథోడ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సాక్షి, సిటీ బ్యూరో: విద్య, గృహ రుణాలకు బ్యాంక్‌ అధికారులు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని హైదరాబాద్‌ కలెక్టర్‌ హరిచందన దాసరి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. బ్యాంకర్లు వార్షిక ప్రణాళిక ప్రకారం టార్గెట్‌ ను అమలు చేయాలని ఆదేశించారు. కొన్ని బ్యాంకుల పనితీరు అసంతృప్తిగా ఉందన్నారు. అకౌంట్‌ లేని విద్యార్థులకు జీరో అకౌంట్‌ కు అన్ని బ్యాంకులు సహకరించాలని బ్యాంక్‌ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్బీఐ ఎల్డీ్‌ఓ రెహమాన్‌, నాబార్డ్‌ డీడీ ఎం హర్ష రఘురామ్‌, ఎల్‌డీఎం నరసింహ మూర్తి, పాల్గొన్నారు.

గృహిణి ఆత్మహత్య 1
1/1

గృహిణి ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement