రంగరాజన్‌కు వివేకానంద పురస్కారం | - | Sakshi
Sakshi News home page

రంగరాజన్‌కు వివేకానంద పురస్కారం

Dec 3 2025 10:09 AM | Updated on Dec 3 2025 10:09 AM

రంగరాజన్‌కు వివేకానంద పురస్కారం

రంగరాజన్‌కు వివేకానంద పురస్కారం

రంగరాజన్‌కు వివేకానంద పురస్కారం అక్రమ నిర్మాణాల కూల్చివేత కాంక్రీట్‌ మిల్లర్‌ లేబర్‌ సంక్షేమానికి కృషి 7నుంచి సీఐటీయూ రాష్ట్ర మహాసభలు

మొయినాబాద్‌: మునివాహన సేవ ఉత్సవ పరంపర పునరుద్ధరణ చేయడంతోపాటు రాజ్యాంగ రామరాజ్య స్థాపనకు కృషి చేసినందుకుగాను చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకుడు రంగరాజన్‌కు వివేకానంద పురస్కారం దక్కింది. గీతా జయంతి సందర్భంగా మహారాష్ట్రలోని పుణేలో సోమవారం రాత్రి వేదశ్రీ తపోవన సంస్థ నిర్వహించిన విశిష్ట కార్యక్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ ఆచార్య దేవ్‌వరత్‌ చేతులమీదుగా రంగరాజన్‌కు సన్మానం చేసి పురస్కారాన్ని అందించారు. శతాబ్దాలుగా సమానత్వం, భక్తి, సామాజిక అడ్డంకులను తొలగించే సందేశాన్ని అందిస్తున్న మునివాహన ఉత్సవాన్ని 2018 ఏప్రిల్‌ 16న చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకుడు రంగరాజన్‌ చేపట్టారు.

ఇబ్రహీంపట్నం: ఖానాపూర్‌ రెవెన్యూ పరిధిలోని గురునానక్‌ విద్యాసంస్థ వద్ద ప్రభుత్వ భూమిలో (గ్యాప్‌ ఏరియా)లో అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను రెవెన్యూ అధికారులు మంగళవారం తెల్లవారుజామున కూల్చివేశారు. ఇబ్రహీంపట్నం తహసీల్దార్‌ సునీతారెడ్డి ఆదేశానుసారం ఆర్‌ఐ సువర్ణ, సర్వేయర్‌ సాయి కృష్ణారెడ్డి, గ్రామపాలన అధికారులు శ్రీనివాస్‌, రాజు, మణికుమార్‌, వీఆర్‌ఏ మహేశ్‌తోపాటు రెవెన్యూ సిబ్బంది జేసీబీ సాయంతో అక్రమ నిర్మాణాలను తొలగించారు. ప్రభుత్వ భూమిలో, గ్యాప్‌ ఏరియాల్లో ఎవరైనా అక్రమంగా నిర్మాణాలు చేపడితే సహించేదిలేదని తహసీల్దార్‌ హెచ్చరించారు.

చేవెళ్ల: కాంక్రీట్‌ మిల్లర్‌ లేబర్‌ అసోసియేషన్‌ సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాకిటి నాగరాజు, ప్రధాన కార్యదర్శి బి.గోపాల్‌ అన్నారు. మండలకేద్రంలో మంగళవారం కాంక్రీట్‌ మిల్లర్‌ లేబర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మిల్లర్‌ మేసీ్త్రలకు చేయూత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల అకాల మరణం చెందిన పవన్‌కుమార్‌ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సంఘం మిల్లర్‌ లేబర్‌కు అండగా ఉంటుందని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని తెలిపారు. ట్రాఫిక్‌ సీఐ సతీష్‌ మాట్లాడుతూ.. ప్రతి కార్మికుడికి లేబర్‌కార్డు తప్పనిసరిగా ఉండాలన్నారు. రోడ్డుపైకి వచ్చే కార్మికులు లైసెన్స్‌లు పొంది ఉండాలని, ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాలని సూచించారు. కార్యక్రమంలో సంఘం సౌత్‌జోన్‌ ప్రధాన కార్యదర్శి శ్రీరాములు, స్టేట్‌ జాయింట్‌ సెక్రెటరీ భరత్‌కుమార్‌, ఏఐటీయుసీ జిల్లా నాయకులు కె. రామస్వామి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

అనంతగిరి: సీఐటీయూ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సంఘం వికారాబాద్‌ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌ అన్నారు. ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు మెదక్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న సభలకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను మంగళవారం సీఐటీయూ సంఘం నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. కార్మికుల సమస్యల పరిష్కారంలో సీఐటీయూ ముందుంటుందని అన్నారు. జిల్లా నుంచి పెద్ద ఎత్తున కార్మికులు హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కోశాధికారి చంద్రయ్య, ఉపాధ్యక్షురాలు నర్సమ్మ, మైపాల్‌, సుదర్శన్‌, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement