గుర్తు తెలియని వృద్ధుడి మృతి
మీర్‌పేట: గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి కథనం ప్రకారం.. నవంబరు 13న బీఎన్‌రెడ్డినగర్ టీచర్స్‌కాలనీలోని పావని ఆస్పత్రి ఎదుట తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న గుర్తు తెలియని వృద్ధుడు (70) పడి ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు వృద్ధున్ని నాదర్‌గుల్‌లోని మాతృదేవోభవ వృద్ధాశ్రమంలో చేర్పించారు. సోమవారం అతను మృతి చెందాడని, మృతుడికి సంబంధించి తెలిసిన వారు మీర్‌పేట పీఎస్‌లో సంప్రదించాలని ఎస్‌ఐ పేర్కొన్నారు.


