అన్నా డబ్బులున్నయా.. | - | Sakshi
Sakshi News home page

అన్నా డబ్బులున్నయా..

Nov 29 2025 7:57 AM | Updated on Nov 29 2025 7:57 AM

అన్నా

అన్నా డబ్బులున్నయా..

యాచారం: ‘అన్నా.. సర్పంచ్‌ రిజర్వేషన్‌ కలిసొచ్చింది.. ఏమైనా డబ్బులున్నయా.. రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు చూడు అత్యవసరమన్నా.. నేను గెలిస్తే నీవు గెలిచినట్లే’ అని పంచాయతీ పోటీదారులు అప్పుల కోసం ఆరాటపడుతున్నారు. ఇందుకోసం వ్యవసాయ భూమి, లేదా ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేసేందుకు ముందుకు వస్తున్నారు. వచ్చే నెల 11, 14, 17 తేదీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ నిర్ణయించిన నేపథ్యంలో నగదు సమకూర్చుకునే పనిలో బిజీగా ఉన్నారు. జిల్లాలోని 526, 4,668 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం సర్పంచ్‌లుగా పోటీ చేస్తున్న వారిలో చాలా వరకు స్థానికంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేవారే. రెండేళ్లుగా బిజినెస్‌ లేకపోవడంతో కొంత డీలా పడ్డారు. ఈక్రమంలో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన పంచాయతీ ఎన్నికలు రానే వచ్చాయి.

పదవులకు భలే డిమాండ్‌

మహానగరం చుట్టూ విస్తరించి ఉన్న పలు మండలాల్లోని గ్రామాల్లో సర్పంచ్‌ పదవులకు భలే డిమాండ్‌ ఉంది. వెంచర్ల ఏర్పాటు, ఇళ్ల నిర్మాణం, పరిశ్రమల కోసం పంచాయతీల అనుమతులు ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో సర్పంచ్‌లుగా గెలిచిన వారికి ఎంతో కొంత ఆదాయానికి అవకాశం ఉంటుంది. దీంతో ఎన్ని డబ్బులైనా ఖర్చు చేసి, సర్పంచ్‌గా గెలవాల్సిందేనని ఆశావహులు పట్టుదలతో ఉన్నారు. వెయ్యి మంది నుంచి 2,500 మంది ఓటర్లకు పైగా ఉన్న గ్రామాల్లో సర్పంచ్‌గా పోటీ చేసేందుకు కనీసం రూ.50 లక్షల నుంచి కోటి వరకు ఖర్చవుతుందని తెలుస్తోంది. పోటీ చేసే వ్యక్తికి మంచి పేరున్నా.. ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా ఎన్నికల సమయంలో పెద్ద మొత్తం డబ్బు ఖర్చు చేయనిదే గెలిచే పరిస్థితి ఉండదు. అందుకే పోటీదారులంతా అప్పుల కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఐదు రూపాయల వడ్డీ అయినా సరే అప్పు తీసుకునేందుకు వెనకాడటం లేదు. ఇదే అదనుగా భావిస్తున్న వడ్డీ వ్యాపారులు ముందు జాగ్రత్తగా భూములు, ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయించుకుని అప్పులు ఇస్తున్నారు. ఇబ్రహీంపట్నం, కందుకూరు డివిజన్ల పరిధిలోని యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, కందుకూరు, ఆమనగల్లు, కడ్తాల్‌, మాడ్గుల, తలకొండపల్లి మండలాల్లో ఈవ్యాపారం జోరుగా సాగుతోంది.

రూ.2 వేల కోట్లకు పైనే ఖర్చు

జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహులు రూ.2 వేల కోట్లకు పైగానే ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. చిన్న గ్రామంలో నాలుగు పార్టీల మద్దతుదారులు పోటీ చేస్తే రూ.2 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉంటుంది. అదే 2,500లకు పైగా ఓటర్లు ఉన్న గ్రామ పంచాయతీల్లో నలుగురైదుగురు బరిలో ఉంటే రూ.5 కోట్లకు పైగానే ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో ఈమొత్తం కొంత తగ్గే అవకాశం ఉన్నా, జనరల్‌, బీసీ స్థానాల్లో అంతకు మించి పెరుగుతుంది. ఫ్యూచర్‌ సిటీ పరిధిలోని గ్రామాల్లో పంచాయతీ సమరం మరింత వేడిగా సాగే చాన్స్‌ ఉంది.

వడ్డీ ఎంతైనా ఓకే!

భూమి లేదా ప్లాట్‌ రిజిస్ట్రేషన్‌ చేస్తా

సర్పంచ్‌గా పోటీ చేసే అవకాశంవచ్చింది.. నేను గెలిస్తే నువ్వు గెలిచినట్లే

నగదు కోసం పంచాయతీ పోటీదారుల పాట్లు

అన్నా డబ్బులున్నయా..1
1/1

అన్నా డబ్బులున్నయా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement