
కష్టపడిన వారికే పార్టీ పదవులు
ఏఐసీసీ పరిశీలకుడు, ఎంపీ రాబర్ట్ బ్రూస్
తుక్కుగూడ: కష్టపడిన వారికే పార్టీ పదవులు దక్కుతాయని ఏఐసీసీ పరిశీలకుడు, తిరునళ్వేలి ఎంపీ రాబర్ట్ బ్రూస్ అన్నారు. మున్సిపల్ కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌హాల్‌లో శనివారం డీసీసీ అధ్యక్షుడి ఎంపికపై పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని సూచించారు. పార్టీ పదవుల్లో యువత, మహిళలకు పెద్దపీట వేస్తామన్నారు. డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక కోసం జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్, పార్టీ జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ తీగల అనిత, నాయకులు దేప భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
● ఎలక్ట్రోరల్ రోల్ కాపీల అందజేతలో ఆర్డీఓ నిర్లక్ష్యం
● కొంతమందికే సర్టిఫైడ్ కాపీల అందజేత
● ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన రైతులు
యాచారం: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచేందుకు ఫార్మాసిటీ భూ బాధితులు రెడీ అయ్యారు. సుమారు యాభై మందికిపైగా పోటీలో ఉండాలని భావించినప్పటికీ ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంత్‌రెడ్డి తమకు సకాలంలో ఎలక్ట్రోరల్ రోల్ కాపీలు అందజేయలేదని తెలిపారు. శనివారం రాత్రి 7 గంటల వరకు కార్యాలయం వద్దే వేచిచూశామని, ఓపిక నశించి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో 7 గంటల తర్వాత కొందరికి మాత్రమే ఇచ్చారని వివరించారు. తాము బరిలో ఉంటే ప్రభుత్వానికి అంత భయమెందుకని ప్రశ్నించారు. ఆదివారం నామినేషన్లు సమర్పిస్తామని తెలిపారు.

కష్టపడిన వారికే పార్టీ పదవులు