మరింత ‘విలువ’! | - | Sakshi
Sakshi News home page

మరింత ‘విలువ’!

Oct 19 2025 8:27 AM | Updated on Oct 19 2025 8:27 AM

మరింత

మరింత ‘విలువ’!

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్‌ వాల్యూకు.. బహిరంగ మార్కెట్లోని భూముల విలువకు భారీ వ్యత్యాసం ఉంది. ఈ లోపాన్ని సరిదిద్దేందుకు ప్రభుత్వం భూముల మార్కెట్‌ విలువను సవరించాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలోని ఓఆర్‌ఆర్‌ లోపల ఉన్న భూముల మార్కెట్‌ విలువను సవరిస్తూ ప్రతిపాదనలు సిద్ధం చేసి, ప్రభుత్వానికి నివేదించాం. ప్రాంతాన్ని, భూ స్వరూపాన్ని, అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలను, డిమాండ్‌ను బట్టి ప్రస్తుతం ఉన్న మార్కెట్‌ విలువను 40 నుంచి 50 శాతం పెంచాలని ప్రతిపాదించాం’ అని జిల్లా స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ల విభాగం అధికారి సంతోష్‌ మందల చెప్పారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన మాటల్లోనే.. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత 2021లో భూముల మార్కెట్‌ విలువను 20 శాతం పెంచుతూ అప్పటి ప్రభుత్వం తొలిసారిగా నిర్ణయం తీసుకుంది. తర్వాత 2022లో 33 శాతం పెంచింది. తాజాగా మరోసారి భూ విలువను సవరించేందుకు సిద్ధమైంది. మార్కెట్‌ విలువల్లో హెచ్చుతగ్గులపై ఇప్పటికే కసరత్తు చేశాం. స్థానికంగా ఉన్న వాణిజ్యపరమైన డిమాండ్‌ను, మౌలిక సదుపాయాలను బట్టి 40 నుంచి 50 శాతం, కొన్నిచోట్ల అంతకు మించి ఽవిలువ పెంచాలని నిర్ణయించాం. ప్రస్తుతం ఈ ప్రతిపాదన లు ప్రభుత్వ పరిశీల నలో ఉన్నాయి. తుది నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమే. గచ్చిబౌలిలో అపార్ట్‌మెంట్‌కు సంబంధించి చదరపు అడుగు ధర ప్రస్తుతం రూ.3000 ఉంది. దీన్ని కనీసం 60 శాతం (రూ.4,800) పెంచాలని ప్రతిపాదించాం. నార్సింగి, మణికొండ, రాయదుర్గం, నానక్‌రాంగూడ, కోకాపేట్‌, తదితర ప్రాంతాల్లోని వ్యాణిజ్య భూములు బహిరంగ మార్కెట్లో ఎకరం రూ.వంద కోట్లకు పైనే పలుకుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్‌లోని భూ విలువ ఆధారంగా ప్రధాన రోడ్ల వెంట గజం ధరను రూ.లక్ష వరకు పెంచాలని ప్రతిపాదించాం. ఇక మహేశ్వరంలో పుస్తక విలువ రూ.2,100 మాత్రమే ఉంది. అదే వాణిజ్య స్థలం విలువ రూ.10,200 ఉంది. ఇలాంటి చోట్ల రూ.2,100 ఉన్న విలువను కనీసం రూ.3,800 నుంచి రూ.4,500 వరకు పెంచాలని ప్రతిపాదించాం. వివాదాస్పద స్థలాల డబుల్‌ రిజిస్ట్రేషన్లకు కారణమవుతున్న నకిలీలపై నిఘా ఏర్పాటు చేశాం. ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు ముందు క్రయవిక్రయదారులకు సంబంధించిన ప్రతి లింకు డాక్యుమెంట్‌ను పరిశీలిస్తున్నాం. ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే పోలీసు కేసు నమోదు చేయిస్తున్నాం. వివాదాస్పద స్థలాలను, డాక్యుమెంట్లను నిషేధిత జాబితాలో చేర్చుతున్నాం. దళారులు, దస్తావేజు లేఖరుల సహాయం లేకుండా నేరుగా స్లాట్‌ బుక్‌ చేసుకుని వచ్చే వారికి పారదర్శకంగా సేవలు అందిస్తున్నాం. అక్రమ వసూళ్లు, అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడే ఎస్‌ఆర్‌ఓలపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నాం. పరిగిలో ఇప్పటికే ఇద్దరు అధికారులను సస్పెండ్‌ చేశాం. వనస్థలిపురం పార్క్‌ స్థలం రిజిస్ట్రేషన్‌ విషయంలో విచారణకు ఆదేశించాం. జిల్లాలో నెలకు సగటున 21 వేల నుంచి 22 వేల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు అవుతుంటాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి ప్రతి నెలా రూ.350 నుంచి రూ.360 కోట్ల ఆదాయం సమకూరుతుంది. ప్రభుత్వానికి భారీగా ఆదాయాన్ని సమకూర్చిపెడుతున్న రిజిస్ట్రేషన్ల శాఖకు పక్కా భవనాలు లేవు. ఉన్న వాటిలో కనీస మౌలిక సదుపాయాలు లేవు. ఔటర్‌ రింగ్‌రోడ్డు లోపల 39 సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసులున్నాయి. వీటలో మెజార్టీ ఆఫీసులు కనీస వసతులు లేని ఇరుకై న అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ప్రతి మూడు, నాలుగు ఎస్‌ఆర్‌ఓలకు ఒక ఇంటిగ్రేటెడ్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసులను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

దళారులపై ఆంక్షలు

ఇప్పటికే శేరిలింగంపల్లిలో మూడు ఎకరాల భూమిని కేటాయించి, ఇటీవలే శంకుస్థాపన కూడా చేసింది. పటాన్‌చెరు, కండ్లకోయ, కోహెడ, మంఖాల్‌, బంజారాహిల్స్‌, మలక్‌పేట్‌, మల్లాపూర్‌, గాజులరామారం, బోయిన్‌పల్లి, కూకట్‌పల్లి, ఎల్బీనగర్‌లో ఇంటిగ్రేటెడ్‌ భవనాలు అందుబాటులోకి రానున్నాయి. పాస్‌పోర్ట్‌ కార్యాలయం తరహాలో స్లాట్‌బుక్‌ చేసుకున్న వారికే లోనికి అవకాశం ఉంది. దస్తావేజులేఖరులు, దళారుల రాకపోకలపై పూర్తి నియంత్రణ ఉంటుంది.

ప్రభుత్వానిదే తుది నిర్ణయం

ఆ వ్యత్యాసాన్ని పూడ్చేందుకే..

పత్రాలన్నీ పరిశీలించిన తర్వాతే..

మెరుగైన సేవల కోసం..

భూముల మార్కెట్‌ వాల్యూ సవరణ

ప్రభుత్వానికి ప్రతిపాదనలు

40 నుంచి 50 శాతం

పెరిగే అవకాశం

అన్ని లింకులు పరిశీలించాకే ఆస్తుల రిజిస్ట్రేషన్‌

అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా సేవలు

స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ జిల్లా అధికారి సంతోష్‌

మరింత ‘విలువ’!1
1/1

మరింత ‘విలువ’!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement