
చివరి రోజు జోరు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: మద్యం షాపులకు 2025–27 కాలానికి నిర్వహించిన టెండర్లలో చివరి రెండు రోజులు దరఖాస్తు దారులు పోటెత్తారు. మొదట్లో దరఖాస్తుల సమర్పణ మందకొడిగా సాగినప్పటికీ శనివారం ఆఖరి రోజు కావడం, దీపావళి ముందు వచ్చే ధంతేరాస్ శుభానికి సూచికగా భావిస్తుండటంతో మెజార్టీ వ్యాపారులు క్యూ కట్టారు. జిల్లాలోని శంషాబాద్, సరూర్‌నగర్ ఎకై ్సజ్ జిల్లాల పరిధిలోని షాపులకు బండ్లగూడ జాగీర్ ఎకై ్సజ్ అకాడమీలో దరఖాస్తులను స్వీకరించారు. 249 మద్యం షాపులకు రాత్రి 8 గంటల వరకు శంషాబాద్ డివిజన్ పరిధిలో 6,012, సరూర్‌నగర్ డివిజన్ పరిధిలోని 5,800 దరఖాస్తులు అందాయి. గతంలో నిర్వహించిన టెండర్లకు జిల్లా వ్యాప్తంగా 21,615 దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.432.3 కోట్ల ఆదాయం సమకూరగా, గతంతో పోలిస్తే ఈసారి దరఖాస్తు ఫీజును రూ.3 లక్షలకు పెంచినప్పటికీ ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో ఆదాయం తగ్గినట్లు తెలిసింది.
మద్యం దుకాణాలకు భారీగా దరఖాస్తులు
శనివారంతో ముగిసిన గడువు
రాత్రి పొద్దుపోయే వరకు స్వీకరణ
జిల్లాలో 249 షాపులకు టెండర్లు ఆహ్వానం