
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలిసిన ఆచారి
అబ్దుల్లాపూర్‌మెట్: రెండు నెలలుగా కొనసాగుతూ వస్తున్న బాటసింగారం రైతు సేవా సహకార సంఘం (ఎఫ్‌ఎస్‌సీఎస్) చైర్మన్ పదవీ వివాదం ఎట్టకేలకు ముగిసింది. చైర్మన్‌గా కొత్తపల్లి జైపాల్‌రెడ్డిని నియమిస్తూ జిల్లా సహకార శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఉత్తర్వు పత్రాన్ని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి శనివారం జైపాల్‌రెడ్డికి అందజేశారు. సంఘం కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. సంఘంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
పహాడీషరీఫ్: బస్తీల్లో సమస్యలు లేకుండా తగిన చర్యలు తీసుకుంటానని మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి తెలిపారు. జల్‌పల్లి మున్సిపాలిటీ శ్రీరాం కాలనీలోని 20వ వార్డు ప్రజలు స్థానికంగా నెలకొన్న అవుట్‌లెట్ తదితర సమస్యల విషయమై ఎమ్మెల్యే సబితారెడ్డిని శనివారం ఉదయం ఆమె నివాసంలో కలిసి విన్నవించారు. స్పందించిన ఆమె వెంటనే కమిషనర్‌కు ఫోన్ చేయడంతో 40 మంది సిబ్బందితో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. అనంతరం ఆమె నేరుగా శ్రీరాం కాలనీకి వచ్చి స్థానికంగా పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే ధ్యేయమని అన్నారు. బస్తీల్లో నెలకొన్న సమస్యలపై మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అవుట్‌లెట్, దెబ్బతిన్న రహదారులకు సంబంధించి డీపీఆర్ రూపొందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సూరెడ్డి కృష్ణారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ షర్ఫుద్దీన్ హామెద్, సీనియర్ నాయకులు నిరంజన్, యంజాల అర్జున్, దూడల శ్రీనివాస్ గౌడ్, నవపేట ఆంజనేయులు, కర్నాటి పద్మ, వాసుబాబు తదితరులు పాల్గొన్నారు.

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలిసిన ఆచారి

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలిసిన ఆచారి