
బీసీ రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటోంది
ప్రయాణికుల నిలువు దోపిడీ ప్రైవేటు వాహనాలు బీసీ బంద్‌ను భారీగా సొమ్ము చేసుకున్నాయి. ఇదే అదనుగా రెట్టింపు వసూలు చేశాయి.
ఆమనగల్లు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటోందని ఎకై ్సజ్, టూరిజం శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల అమలుకు మద్దతుగా ఆమనగల్లు పట్టణంలో శనివారం నిర్వహించిన బంద్‌కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు దక్కాల్సిందేనని అన్నారు. ఇందులో భాగంగా కులగణన నిర్వహించిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించిందని, ఈ విషయమై అసెంబ్లీలో చర్చించి, ఆమోదించించిన అనంతరం గవర్నర్, కేంద్ర ప్రభుత్వానికి పంపించామని స్పష్టం చేశారు. అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లగా రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించిందని, అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందని గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక నాయకులు గుర్రం కేశవులు, శివలింగం, చుక్క అల్లాజీగౌడ్, కాసోజు రాము తదితరులు ఉన్నారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు