పోలీస్‌ స్టిక్కర్‌ ఉన్న కారులో వచ్చి హల్‌చల్‌ | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ స్టిక్కర్‌ ఉన్న కారులో వచ్చి హల్‌చల్‌

Oct 19 2025 8:26 AM | Updated on Oct 19 2025 8:26 AM

పోలీస్‌ స్టిక్కర్‌ ఉన్న కారులో వచ్చి హల్‌చల్‌

పోలీస్‌ స్టిక్కర్‌ ఉన్న కారులో వచ్చి హల్‌చల్‌

ల్యాంకోహిల్స్‌లో సెక్యూరిటీ గార్డులపై దాడి

15 మందిపై కేసు నమోదు

ఐదుగురి అరెస్ట్‌

గచ్చిబౌలి: పోలీస్‌ స్టిక్కర్‌ ఉన్న కారులో వచ్చి సెక్యూరిటీ గార్డులపై దాడికి పాల్పడిన వారిని అరెస్ట్‌ చేసిన సంఘటన రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ల్యాంకోహిల్స్‌ బ్లాక్‌ 3ఎల్‌హెచ్‌లో మహరాష్ట్ర కేడర్‌కు చెందిన ఓ ఐపీఎస్‌ అధికారి తల్లి అద్దెకు ఉంటోంది. ఈ నెల 15న ఉదయం వినాయక రెడ్డి అనే వ్యక్తి ల్యాంకోహిల్స్‌లోని ఫ్లాట్‌ నెంబర్‌ 1703కి వెళ్లేందుకు వచ్చాడు. విజిటర్స్‌ లైన్‌లో కాకుండా రెసిడెన్సీ లైన్‌లో వెళ్లడంతో సెక్యూరిటీ సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. పాస్‌ ఇవ్వడం లేదని చెప్పడంతో ఫ్లాట్‌ నెంబర్‌ 1703 నుంచి మురళి అనే వ్యక్తి కిందికి వచ్చాడు. వచ్చీరావడంతో అతను గొడవకు దిగడంతో సెక్యూరిటీగార్డు బాలకృష్ణ అతడిని తోశాడు. దీంతో మురళి సెక్యురిటీ గార్డుపై చేయడంతో అతను ప్రతిదాడి చేశాడు. అక్కడి నుంచి వెళ్లిపోయిన మురళి సాయంత్రం మరి కొందరితో కలిసి వచ్చి సెక్యూరిటీ గార్డులైన బాలకృష్ణ, చంద్‌లపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో దాదాపు 15 మంది పాల్గొన్నట్లు ఆరోపిస్తూ బాధితులు రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు 10 మందికి నోటీసులు ఇచ్చి పంపారు. మరో ఐదురుగురు పరారీలో ఉన్నారు. ఇది ఇలా ఉండగా దాడి చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ సెక్యూరిటీ గార్డులు శనివారం ల్యాంకోహిల్స్‌కు వెళ్లే దారిలో ఆందోళన చేపట్టారు. ఇప్పటికే కేసు నమోదు చేశామని, మరో ఐదుగురు పరారీలో ఉన్నారని రాయదుర్గం పోలీసులు సర్ధిచెప్పడంతో వారు ఆందోళన విరమించారు. అయితే ఆ తర్వాత కొద్ది సేపటికే పరారీలో ఉన్న ఐదుగురు వ్యక్తులు పోలీస్‌ స్టిక్కర్‌ఉన్న కారులో వచ్చి రాయదుర్గం పెట్రోల్‌ మొబైల్‌ సిబ్బంది చూస్తుండగానే సిబ్బందిపై దాడికి పాల్పడటంతో వారిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. మహరాష్ట్ర క్యాడర్‌కు చెందిన ఐపీఎస్‌ ఆఫీసర్‌ కేసును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. నోటీసులతో సరిపెట్టాలని సైబరాబాద్‌ పోలీసు ఉన్నతాధికారులను కోరినా అందుకు నిరాకరించి రిమాండ్‌ చేసినట్లుగా సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement