
గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి అరెస్టు
షాద్‌నగర్: భూమిని కౌలుకు తీసుకొని అక్రమంగా గంజాయి మొక్కలు సాగు చేస్తున్న వ్యక్తిని శనివారం కేశంపేట పోలీసులు అరెస్టు చేశారు. సీఐ నరహరి కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూరు గోదావరికి చెందిన కొప్పర్తి శ్రీను కొంత కాలం క్రితం కేశంపేట మండలం వేములనర్వ గ్రామానికి వచ్చాడు. గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద కొంత భూమిని కౌలుకు తీసుకున్నాడు. ఆ భూమిలో గుట్టుగా గంజాయి మొక్కలను సాగు చేశాడు. సమాచారం అందుకున్న ప్రత్యేక పోలీసు బృందం తనిఖీ చేసి గంజాయి మొక్కలను గుర్తించారు. ఈ మేరకు కొప్పర్తి శ్రీనును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.