
ప్రజాసంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
● గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత
● ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
● అభివృద్ధి పనుల ప్రారంభం
మంచాల: ప్రజాసంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. శుక్రవారం మంచాల మండలం ఎల్లమ్మతండాలో రూ.5 లక్షలతో సీసీరోడ్డు, బోడకొండ గ్రామంలో రూ.5 లక్షలతో సీసీరోడ్డు, మంచాలలో రూ.40 లక్షలతో అండర్ డ్రైనేజీ, ఆరుట్లలో రూ.10 లక్షలతో సీసీరోడ్డు, ఆరుట్లలోని బుగ్గరామ లింగేశ్వర స్వామి ఆలయం వద్ద రూ.కోటి ఐదు లక్షలతో సీసీరోడ్డు నిర్మాణం, మరో రూ.5 లక్షలతో భక్తుల సౌకర్యార్థం మరుగుదొడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సబ్సిడీపై రైతులకు పరికరాలుపంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆర్డీఓ అనంతరెడ్డి, తహసీల్దార్ వెంకట ప్రసాద్, ఏసీపీ కేపీవీ రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ కంభాలపల్లి గురునాథ్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వెదిరెహన్మంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంగర విష్ణు వర్ధన్‌రెడ్డి, జయమ్మ, మల్లేశ్, పాండు, ఎల్లేష్, ప్రేమాకర్‌రెడ్డి, రమాకాంత్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి,జంగయ్య తదితరులు పాల్గొన్నారు.