
ఆలయ స్థలాన్ని కాపాడండి
ఇబ్రహీంపట్నం రూరల్: బీరప్పగుడి స్థలాన్ని కాపాడాలని కుర్మ సంఘం ఆదిబట్ల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆలయ భూమిలో ఆ సంఘం నాయకులు గుంతలు తవ్వగా.. వాటిని పోలీసుల సహకారంతో ప్లాట్ల యజమానులు కూల్చివేశారని ఆరోపిస్తూ.. వారితో వాగ్వివాదానికి దిగారు. అనంతరం సంఘం నాయకులు మాట్లాడారు. ప్రైవేటు స్థలంపై హైడ్రాకు, పోలీసులకు ఏంపనని ప్రశ్నించారు. చెరువులు, కుంటలు, అక్రమ నిర్మాణాలను వదిలేసి, పట్టా భూమి జోలికి ఎందుకు వస్తున్నారని మండిపడ్డారు. స్టే ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రోడ్డుఉందని పేర్కొంటూ.. గతంలో హైడ్రా.. గుడి ప్రహరిని కుల్చీవేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సివిల్ తగాదాలో పోలీసులు జోక్యం చేసుకోవద్దని సూచించారు. అనంతరం ఠాణాకు వెళ్లి, భూమి జోలికి రావొద్దని కోరారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ శ్రీశైలం, సంఘం నాయకులు జంగయ్య, రాజు, శివకుమార్, శ్రీనివాస్, వెంకటేశ్, రవి, నర్సింహ, భాస్కర్ పాల్గొన్నారు.