
డీసీసీలో యువతకు పెద్దపీట
చందానగర్: నిబద్ధత, క్రమశిక్షణ, సమర్థత ఉన్న నాయకుడినే డీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేస్తామని ఏఐసీసీ సభ్యుడు తిరునెల్వేలి పార్లమెంట్ సభ్యుడు రాబర్ట్ బ్రూస్ అన్నారు. గురువారం శేరిలింగపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి జగదీశ్వర్‌గౌడ్ ఆధ్వర్యంలో డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి అధ్యక్షతన హఫీజ్‌పేట్ డివిజన్ పరిధి హుడా కాలనీ ఎంఎస్‌పీ కన్వెన్షన్ సెంటర్‌లో అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ సభ్యుడు, తిరునెల్వేలి ఎంపీ రాబర్ట్ బ్రూస్, పీసీసీ ఉపాధ్యక్షుడు కోటంరెడ్డి వినయ్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్‌రెడ్డి హాజరై మాట్లాడారు. ప్రతీ కార్యకర్త అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కాంగ్రెస్ శక్తిని పునరుద్ధరించేందుకు సమన్వయంగా పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ యువతకు ప్రాధాన్యత ఇస్తుందని.. డీసీసీ కమిటీలోనూ వారికి పెద్దపీట వేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాసరావు, దొడ్ల వెంకటేశ్ గౌడ్, నియోజకవర్గ కోఆర్డినేటర్ రఘునందన్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ అశోక్‌గౌడ్, నియోజకవర్గ సీనియర్ నాయకులు, కంటెస్టెడ్ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
నిబద్ధత, క్రమశిక్షణ, సమర్థత ఉన్న నాయకుడే అధ్యక్షుడు
తిరునెల్వేలి పార్లమెంట్ సభ్యుడు రాబర్ట్ బ్రూస్