
బిర్యానీలో బొద్దింక!
మొయినాబాద్: చికెన్ బిర్యానీ తినడానికి హోటల్‌కు వెళ్లిన ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. బిర్యానీలో బొద్దింక రావడంతో కంగారుపడ్డాడు. ఈ సంఘటన మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్‌నగర్ ఓ హోటల్‌లో వెలుగుచూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అజీజ్‌నగర్‌కు చెందిన సత్యనారాయణ హిమాయత్‌నగర్ రెవెన్యూలో ఉన్న ఓ హోటల్లో బిర్యానీ తినడానికి వెళ్లాడు. చికెన్ బిర్యాని ఆర్డర్ చేయడంతో తెచ్చిపెట్టా రు.
బిర్యానీ తిండుండగా అందులో బొద్దింక కనిపించింది. వెంటనే నిర్వాహకులకు చూపించి ప్రశ్నించ గా తమకేమి తెలియదన్నట్లు సమాధానమిచ్చారు. బాధితుడు ఫొటో తీసి సోషల్ మీడియాలో వైరల్ చే శాడు. ఈ హోటల్లో గతంలోనూ బిర్యానీలో ఈగలు, పురుగులు వచ్చిన సంఘటనలు జరిగాయి. ఫుడ్ సేఫ్టీ, క్వాలిటీ కంట్రోల్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయని.. అధికారులు స్పందించి ఇలాంటి హోటళ్లను సీజ్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.