
‘జనహిత’లో నేతల సందడి
మహేశ్వరం: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనహిత పాదయాత్రలో భాగంగా పరిగిలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌ను మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్, పీసీసీ సభ్యుడు దేప భాస్కర్‌రెడ్డి గురువారం కలిసి స్వాగతం పలికారు. మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని పీసీసీ చీఫ్ నేతలకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి ప్రతి కార్యకర్త తీసుకెళ్లాలని మహేశ్‌కుమార్ గౌడ్ దిశానిర్దేశం చేశారు.
తరలిన కాంగ్రెస్ నాయకులు
కందుకూరు: టీపీసీసీ ఆధ్వర్యంలో ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో చేపట్టిన పాదయాత్రలో గురువారం సాయంత్రం మహేశ్వరం నియోజకవర్గం ఇన్‌చార్జి కేఎల్‌ఆర్ ఆధ్వర్యంలో నాయకులు తరలి వెళ్లారు. కందుకూరు నుంచి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు ఏనుగు జంగారెడ్డి, బొక్క జంగారెడ్డి, సీనియర్ నాయకులు సత్యనారాయణ, గణేష్‌నాయక్, మదన్‌పాల్‌రెడ్డి, బాబురావు, కృష్ణ, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.