సిరిసిల్ల: జిల్లా హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్, ఇన్‌చార్జి జెడ్పీ సీఈవో డి.వెంకటమాధవరావుకు అదనపు కలెక్టర్(రెవెన్యూ)గా పదోన్నతి లభించింది. నిర్మల్ అదనపు కలెక్టర్‌గా బదిలీ చేశారు. వెంకట మాధవరావు 2010లో సిరిసిల్ల తహసీల్దార్‌గా పనిచేశారు. ఆర్డీవోగా, డీఆర్‌డీవోగా పనిచేసి న ఆయన హైదరాబాద్ జీహెచ్‌ఎంసీలో పనిచేసి జిల్లా హౌసింగ్ పీడీగా బదిలీపై వచ్చారు. జెడ్పీ సీఈవోగా ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహించారు. పదోన్నతిపై నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్‌గా వెళ్లనున్న వెంకటమాధవరావుకు జిల్లా అధికారులు సోమవారం అభినందనలు తెలిపారు.


