● సీఎమ్మార్ డెలివరీపై దృష్టి సారించాలి ● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: జిల్లాలో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్‌తో కలిసి సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఐకేపీ 123, పీఏసీఎస్ 122, మెప్మా ఆధ్వర్యంలో 6 మొత్తం 251 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని సూచించారు. 2025–2026 ఖరీఫ్, యాసంగి సీజన్ సీఎమ్మార్ డెలివరీపై దృష్టి సారించాలన్నారు. డీఆర్డీవో లక్ష్మీనారాయణ, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అఫ్జల్‌బేగం, సహకారశాఖ అధికారి రామకృష్ణ, పౌరసరఫరాల శాఖ అధికారి బుచ్చిబాబు, మేనేజర్ గోపాల్ పాల్గొన్నారు.
సూపర్ ఎల్‌నినోను సమష్టిగా ఎదుర్కోవాలి
సిరిసిల్ల అర్బన్: సూపర్ ఎల్‌నినో ప్రభావంతో భూగర్బజలాలు తుగ్గతున్న నేపథ్యంలో తాగునీటికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ పేర్కొన్నారు. చంద్రంపేట రైతు వేదికలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులు, రైతులు, మహిళా స్వయం సహాయక సంఘాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ యాసంగి 2026–27లో నీటి లభ్యతకు అనుగుణంగా పంటలు సాగుచేయాలని సూచించారు. కూరగాయలు, పప్పులు, ఆయిల్‌ఫామ్ వంటి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలన్నారు. 2027 జూన్ వరకు తాగునీటి అవసరాలు తీర్చేలా ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్‌బేగం, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, ఉద్యానవశాఖ అధికారి శరత్‌బాబు, పశుసంవర్థకశాఖ అధికారి శ్రీధర్, మత్స్యశాఖ అధికారి సౌజన్య, నీటి పారుదశాఖ, ఎన్పీడిసీఎల్ అధికారులు పాల్గొన్నారు.


