● వ్యాసరచన పోటీలు.. సైబర్ నేరాల నివారణలో పోలీసులు – పౌరుల పాత్ర, డ్రగ్స్ నివారణలో పోలీసుల పాత్ర, విద్యార్థులు డ్రగ్స్ నుంచి ఎలా దూరంగా ఉండగలరు అనే అంశాలపై ఇంటర్ వరకు చదివే విద్యార్థులతో వ్యాసరచన పోటీలు నిర్వహిస్తామని ఎస్పీ తెలిపారు. డిగ్రీ ఆపై విద్యార్థులకు సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడంలో పోలీసుల పాత్రపై వ్యాసరచన పోటీలు నిర్వహిస్తామని తెలిపారు.
● పోలీస్ అధికారులకు సైతం వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతిభ కనబరిచిన మొదటి ముగ్గురికి రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అర్హత లభిస్తుందని తెలిపారు.
● పోలీసుల సేవలు, రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, కమ్యూనిటీ పోలీసింగ్, మూఢనమ్మకాలు, ఇతర సామాజిక రుగ్మతలు, అత్యవసర సమయాల్లో పోలీసుల స్పందన, ప్రకృతి వైపరీత్యాల సమయంలో పోలీసుల సేవలు, పోలీసుల కీర్తి ప్రతిష్టలను పెంచే అంశాలపై ఫొటోలు, షార్ట్‌ఫిలిమ్స్ రూపొందించాలని.. ఉత్తమంగా నిలిచిన వాటిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఈనెల 24లోపు జిల్లా పోలీస్ కార్యాలయంలోని పోలీస్ పీఆర్వోకు అందజేయాలని సూచించారు.
సిరిసిల్ల: ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నామని ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. డీపీవోలో సోమవారం నిర్వహించిన గ్రీ వెన్స్‌సెల్‌లో 17 మంది నుంచి అర్జీలు స్వీకరించి, మాట్లాడారు. ప్రజలకు పోలీస్‌సేవలు చేరువ చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు తెలిపారు. ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధితులకు చట్ట ప్రకారం న్యాయం జరిగేలా చూడాలని ఆయా ఠాణాల అధికారులకు ఫోన్ చేసి ఆదేశించారు.
పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి
పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివని ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. వారి త్యాగాలు స్మరించుకుంటూ ఈనెల 21 నుంచి 31 వరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 21న చందుర్తి మండలం లింగంపేట్ శివారులోని పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద స్మృతి పరేడ్ నిర్వహించి, అమరవీరులకు నివాళులు అర్పిస్తామన్నారు. 21 నుంచి 31 వరకు ఓపెన్‌హౌస్, రక్తదాన శిబిరాలు, ర్యాలీ లు, కొవ్వొత్తుల ర్యాలీలు, అమరవీరుల కుటుంబాలకు పరామర్శ చేపట్టనున్నట్లు వివరించారు.