సిరిసిల్లటౌన్: జిల్లాలో బీజేపీ ధార్మిక సెల్ కార్యవర్గం నియామకం జరిగింది. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం జిల్లా కన్వీనర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర ధార్మిక సెల్ కన్వీనర్ సూర్యప్రకాశ్, జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి హాజరయ్యారు. జిల్లాలోని 13 మండలాలు, 2 మున్సిపాలిటీలకు నూతన అధ్యక్షులు, కోకన్వీనర్లను నియమించారు. వేములవాడ అర్బ న్ మండల అధ్యక్షుడు బుర్ర శేఖర్‌గౌడ్‌తో పాటు ధార్మిక సెల్ ప్రతినిధులను సన్మానించా రు. రాష్ట్ర జాయింట్ కో–కన్వీనర్లు నవీన్‌కుమార్, భోగ రవికుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతిరెడ్డి, జిల్లా మీడియా కన్వీనర్ కాసుగంటి రాజురావు పాల్గొన్నారు.
అన్నప్రసాద ట్రస్టుకు రూ.లక్ష విరాళం
వేములవాడఅర్బన్: రాజరాజేశ్వరస్వామి నిత్య అన్నప్రసాద ట్రస్టుకు పెద్దిరెడ్డి జయవర్ధన్‌రెడ్డి, గ్రీష్మారెడ్డి దంపతులు రూ.1,01,116 విరాళంఅందించారు. కుమారుడు రుగ్వేద్‌రెడ్డి పేరిట చెక్కును ఏఈవో లక్ష్మణ్‌రావుకు అందజేశారు.
ఊరికో జమ్మిచెట్టు
బోయినపల్లి: గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్ చేపట్టిన ‘ఊరి ఊరికో జమ్మిచెట్టు– గుడిగుడికో జమ్మి చెట్టు’ కార్యక్రమంలో భాగంగా మండలంలోని స్తంభంపల్లిలో సోమ వారం జమ్మిమొక్క నాటారు. బీఆర్‌ఎస్ నాయకులు అక్కనపల్లి కరుణాకర్, బత్తిని కమలాకర్, మల్లారపు చందు, హుస్సేన్, చింతలకోట రామస్వామి, నేరెళ్ల మల్లేశం, అక్కెనపల్లి కనకయ్య, అక్కనపల్లి నరేశ్, గడ్డం భార్గవ్, తంగళ్లపల్లి హరీశ్, అక్కెనపల్లి అనిల్, ముత్యపు గణేశ్, తునికి అఖిల్, తంగళ్లపల్లి బింటు, బొంగాని ప్రమోద్, కొట్టేపల్లి నరేశ్ పాల్గొన్నారు.
అంతరాయం లేని విద్యుత్ సరఫరా లక్ష్యం
వీర్నపల్లి: మండలంలో అంతరాయం లేని విద్యుత్ సరఫరా లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్‌ఈ శ్రీనివాస్ తెలిపారు. వీర్నపల్లి, బాబాయిచెరువు తండాల్లో విద్యుత్ నియంత్రికలను సోమవారం ప్రారంభించినట్లు చె ప్పారు. లోవోల్టేజీ సమస్యను అధిగమించేందుకు మరో రెండు చోట్ల కెపాసిటర్ బ్యాంకులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సబ్‌స్టేషన్‌లో కొత్త బ్రేకర్ ఏర్పాటు పనులు ప్రారంభించిన ట్లు వివరించారు. డీఈ అంజయ్య, ఏఈ రమేశ్, సెస్ డైరెక్టర్ మల్లేశం పాల్గొన్నారు.


