నేటి నుంచి దేవీ నవరాత్రోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి దేవీ నవరాత్రోత్సవాలు

Oct 11 2026 1:16 PM | Updated on Oct 11 2026 1:16 PM

వేములవాడ: వేములవాడ రాజన్న క్షేత్రంలో దేవీ నవరాత్రోత్సవాల షెడ్యూల్‌ను అధికారులు శనివారం ప్రకటించారు. దసరా సందర్భంగా ఆలయంలో వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈనెల 11న ఆదివారం నుంచి 20 వరకు ఆలయంలో పలు ప్రత్యేక పూజలు జరగనున్నాయి. 20న దసరాను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరగనున్నాయి.

వయోవృద్ధుల కమిటీ ఏర్పాటు చేయాలి

సిరిసిల్ల: జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్లలో సీనియర్‌ సిటిజన్ల వలంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని ఎస్పీ మహేశ్‌ బి గితేను తెలంగాణ ఆల్‌ సీనియర్‌ సిటిజన్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు శనివారం కోరారు. ప్రతి మండలంలో వయో వృద్ధుల సమస్యల పరిష్కారానికి సీనియర్‌ సిటిజన్‌ వలంటరీ కమిటీని ఏర్పాటు చేస్తే.. వేధింపులకు గురి అవుతున్న తల్లిదండ్రుల కేసులు సత్వరమే పరిష్కారమవుతాయని కోరారు. కమిటీల ఆధ్వర్యంలో కౌన్సిలింగ్‌ నిర్వహించడం, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారికి చట్ట పరిధిలో ఎదురయ్యే సమస్యలను గుర్తుచేస్తారని పేర్కొన్నారు. తద్వారా వయో వృద్ధులకు కాస్త ఊరట లభిస్తుందని సీనియర్‌ సిటిజన్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్‌ జనపాల శంకరయ్య, జిల్లా అధ్యక్షుడు చేపూరి బుచ్చయ్య, కోశాధికారి దొంత దేవదాస్‌, కార్యదర్శులు గౌరిశెట్టి ఆనందం, ఆంకారపు జ్ఞానోభా కోరారు.

దశాబ్ది ఉత్సవాలు విజయవంతం చేయాలి

సిరిసిల్ల: జిల్లా ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం పట్టణంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య తెలిపారు. శనివారం సిరిసిల్లలో మాట్లాడుతూ ఉదయం 10:30 గంటలకు కొత్త బస్టాండ్‌ వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి, కేసీఆర్‌, కేటీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తామన్నారు. నేతన్న, అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాలలు సమర్పించి, అమరవీరుల స్తూపానికి నివాళి అర్పిస్తారన్నారు. అంబేడ్కర్‌ చౌరస్తాలో కేక్‌ కటింగ్‌, గులాబీ బెలూన్లు ఎగురవేయడంతో పాటు తెలంగాణ ఉద్యమకారులకు సన్మాన కార్యక్రమాలు ఉంటాయన్నారు. మధ్యాహ్నం కలెక్టర్‌ చౌరస్తాలో బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుతామని, సాయంత్రం 5:30 గంటలకు గాంధీ చౌక్‌ నుంచి బతుకమ్మలతో ర్యాలీగా బయలుదేరి, బతుకమ్మ ఘాట్‌ వద్ద వేడుకలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ వేడుకల్లో పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.

ప్రైవేటు టీచర్లకు దసరా సెలవుల్లేవా?

సిరిసిల్లటౌన్‌: ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో పనిచేసే సిబ్బందికి దసరా సెలవులు వర్తింపజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ముశం రమేశ్‌ డిమాండ్‌ చేశారు. పార్టీ కార్యాలయంలో శనివారం మాట్లడుతూ ప్రభుత్వం పాఠశాలలకు ఈ నెల 10 నుంచి 22 వరకు 13 రోజుల పాటు దసరా సెలవులు ప్రకటించినప్పటికీ, కొన్ని ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు అమలు చేయడం లేదన్నారు. ఆన్‌లైన్‌ క్లాసులు, టెన్త్‌ స్పెషల్‌ క్లాసుల పేరుతో తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులను, ఉపాధ్యాయులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. విద్యార్థులకు సెలవులిచ్చి, టీచర్లు పాఠశాలలకు రావాలని ఒత్తిడి చేయడం సరైన పద్ధతి కాదన్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి, ప్రైవేట్‌ పాఠశాలల్లో సెలవులు అమలు జరిగేలా చూడాలన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎగమంటి ఎల్లారెడ్డి, కోడెం రమణ, పట్టణ కార్యదర్శి ఎలిగేటి రాజశేఖర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement