వేములవాడ: వేములవాడ భీమన్నను ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ శనివారం రాత్రి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికారు. స్వామివారికి అభిషేకాలు నిర్వహించిన అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. డీఈవో ప్రతాప నవీన్, ఏఈవో నాగుల మహేశ్, పీఆర్‌వో శ్రీనివాస్, స్థానాచార్యులు ఉమేశ్‌శర్మ పాల్గొన్నారు.
భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించండి
భీమన్నను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాలని దేవాదాయశాఖ కమిషనర్ హన్మంతరావు ఆదేశించారు. శనివారం కుటుంబసభ్యులతో కలసి శ్రీస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జోడు కోడెలు సమర్పించారు. వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. డీఈవో నవీన్, ఏఈవోలు నాగుల మహేశ్, లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు.


