సప్తమాతృకలు అనగా... బ్రహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, చాముండ, ఇంద్రానిలను పూజిస్తుంటాం. అష్టమం, నవమం, దశమం కూడా ఉంటాయి. పీఠానికి రాజరాజేశ్వరీ దేవి, తర్వాత బాలత్రిపురా సుందరీదేవి, మహిషాసుర మర్ధని అమ్మవారలు ఉంటారు. అష్టమం, నవమం, దశమం చేయకుండా కేవలం సప్తమాతృకా పూజా మాత్రమే కాబట్టి ఏడు రోజుల్లో జరుపుకోవడం వేములవాడలో సనాతనంగా సప్తమాతృకలను పూజించిన అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోంది.
– చంద్రగిరి శరత్‌శర్మ, ఆలయ ప్రధాన అర్చకులు
పుట్టినిల్లు.. మెట్టినిల్లు
సద్దుల బతుకమ్మ వేడుకలు మెట్టినిల్లు వేములవాడలో ఏడు రోజులకు జరుపుకున్న అనంతరం పుట్టినిల్లు సిరిసిల్లలో 9 రోజుల్లో జరిగే వేడుకల్లో పాల్గొంటా. ఆలయ ప్రాంగణంలో ఏటా కోలాటాలతో సంబరాలు జరుపుకుంటాం. మిత్రులంతా కలుస్తుంటారు.
– అత్తమ్మ కట్కం అహల్య, కూతురు దీక్షతో కట్కం సునీత, వేములవాడ


