అట్టహాసంగా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు | - | Sakshi
Sakshi News home page

అట్టహాసంగా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

Oct 3 2026 1:32 AM | Updated on Oct 3 2026 1:32 AM

● ప్రారంభించిన ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో 52వ రాష్ట్రస్థాయి బాలుర కబడ్డీ పోటీలు, 36వ రాష్ట్రస్థాయి బాలికల కబడ్డీ పోటీలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. నాలుగురోజుల పాటు జరిగే పోటీలను ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో ఒలింపిక్స్‌ జెండాను ప్రభుత్వవిప్‌ ఆది శ్రీనివాస్‌, ఎస్పీ మహేశ్‌ బీ గీతే ఆవిష్కరించి టార్చ్‌ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి సుమారు 68 జట్లకు చెందిన 1,300 మందికి పైగా క్రీడాకారులు, కోచ్‌లు, మేనేజర్లు, పీఈటీలు, పీడీలు హాజరయ్యారు.

యువత మైదానాల్లో ఉండాలి

యువత మైదానాల్లో ఉండాలని, మత్తులో కాదనీ, గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. క్రీడాకారులకు వసతి, భోజన సదుపాయాలు కల్పించినట్లు పేర్కొన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం యువతను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. వేములవాడ ప్రాంతానికి కబడ్డీ, వాలీబాల్‌, ఖోఖో వంటి గ్రామీణ క్రీడలతో ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. తాను విద్యార్థి దశలో ఉన్నప్పటి నుంచే క్రీడలపై ఆసక్తి ఉందని, ఎమ్మెల్యేగా ఎన్నికై న తర్వాత స్థానిక క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గతేడాది వేములవాడలో రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీలు నిర్వహించినట్లు గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో ఈసారి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీల నిర్వహణకు సహకరించిన జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, అధికారులకు అభినందనలు తెలిపారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ పుల్కం రాజు, వైస్‌చైర్మన్‌ నరాల శేఖర్‌, కబడ్డీ అసోసియేషన్‌ రాష్ట్ర, జిల్లా స్థాయి ప్రతినిధులు , నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement