నివాళి అర్పిస్తున్న కలెక్టర్ గరీమా అగ్రవాల్
నివాళి అర్పిస్తున్న ఎస్పీ మహేశ్ బీ గీతే
సిరిసిల్ల: కలెక్టరేట్‌లో శుక్రవారం మహాత్మాగాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ గరీమా అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దేశ స్వాతంత్య్ర పోరాటంలో గాంధీజీ సేవలను కొనియాడారు. మహనీయుని బాటలో ముందుకు సాగాలని పేర్కొన్నారు. డీఈవో మొండయ్య, డీఎంహెచ్‌వో ఏంజెలా ఆల్ఫ్రెడ్, మైనింగ్ ఏడీ క్రాంతి, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ స్వప్న, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, బీసీ సంక్షేమ అధికారి సౌజన్య తదితరులు పాల్గొన్నారు.
గాంధీజీ జీవితం అందరికీ ఆదర్శం
గాంధీ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన చిత్రపటానికి ఎస్పీ మహేశ్ బీ గీతే పూలమాల వేసి నివాళులర్పించారు. నేటి యువత గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గాలను అనుసరిస్తూ ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని సూచించారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఆర్‌ఐలు సురేశ్, రమేశ్, సీఐలు మొగిలి, మధుకర్, ఎస్సై, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


