సిరిసిల్ల అర్బన్: కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) రద్దు.. ఓపీఎస్ పునరుద్ధరణే ధ్యేయంగా ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ పేర్కొన్నారు. సీపీఎస్ రద్దు చేయాలని కోరుతూ చేపట్టిన జనజాగరణ యాత్ర 17వ రోజు సోమవారం సిరిసిల్లకు చేరుకుంది. ఈ సందర్భంగా కలెక్టరేట్ కార్నర్‌మీటింగ్ నిర్వహించారు. ఆగస్టు 23న చేపట్టే చలో హైదరాబాద్ సభ పోస్టర్‌లు ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వాల శ్రీకాంత్, రాష్ట్ర నాయకులు మల్లికార్జున్, గడ్డం వెంకటేశ్, మహాదేవ్, చంద్రకాంత్, పీఆర్‌టీయూ, టీపీటీఎఫ్ జిల్లా నాయకులు దుమాల రమానాథ్‌రెడ్డి, కిషన్, ఎస్‌టీయూ సదానందం పాల్గొన్నారు.


