సీఎమ్మార్‌ లక్ష్యం పూర్తి చేయండి | - | Sakshi
Sakshi News home page

సీఎమ్మార్‌ లక్ష్యం పూర్తి చేయండి

Jul 28 2026 2:12 AM | Updated on Jul 28 2026 2:12 AM

● రైస్‌మిల్లర్లతో కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

సిరిసిల్ల: రైస్‌మిల్లర్లు కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎమ్మార్‌)ను గడువులోగా అందించాలని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ కోరారు. కలెక్టరేట్‌లో సోమవారం రైస్‌మిల్లర్లతో సమావేశమయ్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ వేలం వేసిన ధాన్యం బకాయిలు గడువులోగా చెల్లించాలని, గత సీజన్‌లో సీఎమ్మార్‌ ఇవ్వడంలో జాప్యం చేయొద్దని సూచించారు. రోజువారీ లక్ష్యాలు నిర్ణయించి, సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌, ఏఎస్పీ చంద్రయ్య, ఎఫ్‌సీఐ జిల్లా మేనేజర్‌ రవిప్రకాశ్‌, జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారి బుచ్చిబాబు, రైస్‌మిల్లర్ల అసోసియేషన్‌ ప్రతినిధులు చేపూరి నాగరాజు, గరిపల్లి ప్రభాకర్‌, పబ్బ నాగరాజు ఉన్నారు.

చెత్తను నాలుగు రకాలుగా వేరు చేసి ఇవ్వాలి

చెత్తను నాలుగు రకాలుగా వేరు చేసి ఇవ్వాలని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ కోరారు. నాలుగు రకాల చెత్త డబ్బాలను పరిశీలించారు. ఆకుపచ్చ డబ్బా తడి చెత్త, నీలం డబ్బా పొడి చెత్త, ఎరుపు డబ్బా శానిటరీ చెత్త, నలుపు రంగు డబ్బా హానికరమైన ప్రత్యేకమైన చెత్త కోసం వినియోగించేందుకు ఏర్పాటు చేశారు. డీఎల్పీవో నరేశ్‌, సచ్ఛభారత్‌ మిషన్‌ జిల్లా కో–ఆర్డినేటర్‌ సురేశ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement