వాంతులు.. జ్వరాలు | - | Sakshi
Sakshi News home page

వాంతులు.. జ్వరాలు

Jul 28 2026 2:12 AM | Updated on Jul 28 2026 2:12 AM

● ఇంటి పరిసరాల్లో దోమలు లేకుండా చూసుకోవాలి. ● కుంటలు, నీటిట్యాంకుల్లో ఎక్కువ కాలం నీరు నిల్వ ఉండకుండా చూడాలి. ● కూలర్లు, వాడి పడేసిన కొబ్బరి బొండాలు ఉండకుండా చూసుకోవాలి.

ప్రబలుతున్న విషజ్వరాలు జిల్లా ఆస్పత్రికి క్యూకట్టిన బాధితులు పల్లెల్లో పడకేసిన పారిశుధ్య నిర్వహణ జనావాసాల మధ్య అపరిశుభ్రత పట్టించుకోని పాలకులు

సిరిసిల్లటౌన్‌: జిల్లాలో ప్రతీ ఇంట్లో జ్వరపీడితులు ఉన్నారు. పడకేసిన పారిశుధ్య నిర్వహణ.. పెరిగిన దోమలతో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. రోడ్లపైనే పారుతున్న డ్రెయినేజీలు.. జనావాసాల మధ్య ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కలతో పరిసరాలు కంపు కొడుతున్నాయి. వాతావరణ పరిస్థితుల్లోనూ తీవ్ర మార్పులతో వైరల్‌ ఫీవర్స్‌ విజృంభిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి నిత్యం 700 మంది వరకు రోగులు ఓపీలో వైద్యసేవలు పొందుతున్నారంటే జ్వరాల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో విషజ్వరాలపై ఫోకస్‌.

ఇవీ పాటించాలి

24 గంటలు వైద్యసేవలు

జిల్లా ఆస్పత్రిలో మూడు షిఫ్టుల్లో 24గంటలు వైద్యసేవలు అందిస్తున్నారు. జూలైలో 68 మంది జ్వరపీడితులు ఆస్పత్రిలో చేరి, చికిత్స పొందారు. పిల్లల వార్డులో 53 మంది ఐపీగా చికిత్స పొందారు. ఇక జీజీహెచ్‌ టెస్టుకు 1,800, మలేరియా టెస్టులకు 1,800 కిట్లు చికెన్‌గున్యాకు టీ–హబ్‌లో 500 కిట్లు అందుబాటులో ఉన్నాయి. జ్వరాలకు సంబంధించిన ఐవీఎఫ్‌(12వేలు), పారాసిటమాల్‌ టాబ్లెట్స్‌(2.60లక్షలు), ఇంజక్షన్లు(7,200), యాంటిబయాటిక్స్‌(13) చొప్పున అందుబాటులో ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం కావాల్సి వస్తే అన్నిరకలా రక్తనమూనాలు 59 అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు మలేరియా, టైఫాయిడ్‌, డెంగీ కేసులు రాలేదని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement