నాన్న కోరిక | - | Sakshi
Sakshi News home page

నాన్న కోరిక

Jun 3 2026 11:56 PM | Updated on Jun 3 2026 11:56 PM

మన ఊరు.. మన బడి

పిల్లలు మీరూ పంపండి...

అనగనగా ఒక ఊరిలో కనకయ్య మల్లమ్మ అనే దంపతులు ఉండేవారు. వారికి ఒక కొడుకు ఆ కొడుకు పేరు నారాయణ. అతడు పదవ తరగతి చదువుతున్నాడు. కానీ చదువును ఆశ్రద్ద చేసేవాడు. కానీ వాళ్ళ నాన్నకు మాత్రం నారాయణను బాగా చదివించాలనే కోరిక ఉండేది. ఒకరోజు కనకయ్యకు గుండెపోటు వచ్చింది. అప్పుడు నారాయణ కనకయ్యను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. డాక్టర్లు పరీక్షించి ఏమీ కాదు అని చెప్పి కొన్ని మందులు ఇచ్చి పంపారు. కానీ.. కొద్ది రోజుల తర్వాత మళ్లీ కనకయ్యకు గుండెపోటు వచ్చింది. అప్పుడు డాక్టర్లు ఆపరేషన్‌ చేయాలి అని చెప్పారు. దానికి రూ. 30 లక్షలు ఖర్చు అవుతాయని చెప్పడం జరిగింది. కానీ.. వాళ్ల దగ్గర అంత డబ్బు లేకపోవడంతో డబ్బు ఏర్పాటుకు చాలా మందిని అడిగారు. కానీ.. ఈలోగ కనకయ్యకు మళ్లీ గుండెపోటు వచ్చి మరణించాడు. అప్పుడు నారాయణ చాలా బాధపడ్డాడు తన వద్ద డబ్బు ఉంటే తన తండ్రిని బతికించుకునే వాడిని అని చాలా ఏడ్చాడు. నాలాంటి పరిస్థితి మళ్లీ ఎవరికీ రాకూడదు అని అనుకున్నాడు. అప్పటి నుండి వాళ్ల అమ్మ చెప్పినట్టు విని బాగా చదివాడు. పదవ తరగతి లో జిల్లా మొదటి స్థానం సాధించాడు. అతని ప్రతిభను చూసి ఒక మంచి కాలేజ్‌ వాళ్లు నారాయణకు ఉచితంగా విద్యను అందించడానికి ముందుకు వచ్చారు. ఆ తరువాత నారాయణ బాగా చదివి డాక్టర్‌ అయ్యాడు. నారాయణ వాళ్ల నాన్న కోరుకున్నది జరిగినందుకు వాళ్ల అమ్మ ఎంతో సంతోషపడింది. నారాయణ ఒక ఆసుపత్రిని నిర్మించి అందరికీ ఉచితంగా వైద్యం చేశాడు.

– హాసిని

తరగతి: 7వ తరగతి

పాఠశాల: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల

గ్రామం: చింతకుంట, కరీంనగర్‌

దుర్గం భైతి,

ప్రభుత్వ ఉపాధ్యాయులు,

రామునిపట్ల, సిద్దిపేట జిల్లా

గాలి గాలి ఓ చిరుగాలి

పవనాలుగా నీవిక తేలి

నీవస్తావులే మా ఇంటికి

నచ్చావులే మా కంటికి !

నీ వల్లే మాకు ఊపిరి ఉంది

నీవు లేకుంటే కలుగు ఇబ్బంది

మమ్ము అంటిపెట్టుకొని ఉంటావు అవునా కాదా ఇక ఏమంటావు ?

నీ సమాధానం ఇక ఏదైనా

నీవు లేకుండా పోదు పొద్దైనా

ఓ గాలితల్లి మా చిరుగాలి మల్లి

నీవు లేక ప్రాణం ఉండదులే మళ్ళి

చెట్లు ఊగితే నీ ఉనికి తెలుసు

అట్లనే చేయకు నీవిక అలుసు

బొగ్గు పులుసు గాలి నీలో ఉంది

దానితో మాకు కలుగు ఇబ్బంది !

గాలి తల్లి మా చిరుగాలి మల్లి

మమ్ము విడిచి ఉండకు నీ వెళ్లి

నీవు లేకుండా ఉండదు ఏ గల్లి

నీవు వస్తేనే బాగుంటుంది మళ్ళీ !

గాలి తల్లి ఓ చిరుగాలి మల్లి

హోరుగాలితో చేయకు లొల్లి

చల్లగా తగిలితే కలుగు హాయి

మెల్లెగ మది ఉప్పొంగు నోయి !

– గుర్రాల లక్ష్మారెడ్డి

కవి రచయిత

గ్రామం:

కల్వకుర్తి,

నాగర్‌ కర్నూల్‌ జిల్లా

గాలి ఓ మా చిరుగాలి

మన ఊరు మన బడి

మనదే ఈ జీవితం

అక్షర జ్ఞానం పొంది

అవుదాం ఉన్నతం

ఒకే మాట ఓకే పాట

ఒకటే మన బడిబాట

అమ్మ నాన్న కలలు కన్న

అక్షరాల పూల తోట

చక్కని క్రమశిక్షణతో

చదువుకుని ఎదుగుదాము

ఆచార్యుల మాట విని

అవనికి వెలుగవుదాము

ఆట పాటలు కంప్యూటర్‌

అవలీలగా నేర్చుకుని

అన్ని రంగాల్లో మనమే

ముందడుగులు వేద్దాము

విలువైన విషయాలతో

విజ్ఞాన విద్యనందుకుని

విశ్వసేవ పథాన మనం

వీరత్వం చూపుదాము

వేసవి సెలవుల్లో మీ కలానికి పదునుపెట్టి బొమ్మలు గీస్తున్నారా? చిట్టి కథలు రాస్తున్నారా? ఏదైనా పర్యాటక ప్రదేశం సందర్శించారా? ఆటపాటల్లో విజయం సాధించి పతకాలు అందుకున్నారా? ఈ విషయాలను మీ స్నేహితులు, పాఠకులతో పంచుకోవాలనుకుంటే వాట్సప్‌ నెం: 8500786474 ద్వారా మాకు పంపండి. మేము ప్రచురిస్తాం. మీ ఫొటో కూడా జతచేయండి. ఊరు..పేరు.. జిల్లా రాయడం మరువొద్దు సుమా...

Advertisement
 
Advertisement
Advertisement