పుస్తకం చేతిలో ఉంటే
భవిష్యత్తు వెలుగులో ఉంటుంది.
అక్షరం నేర్చిన చిన్నారి
ఆకాశాన్ని తాకే విజేత అవుతాడు.
విద్య అనే అమూల్య ధనం
ఎవ్వరూ దోచుకోలేరు ఎన్నడూ.
గురువు చూపిన మార్గంలో,
జ్ఞాన దీపం వెలిగించాలి.
నేటి చదువు రేపటి బలం
దేశానికి అది గొప్ప సంపద.
ప్రతి బిడ్డ చదువుకోవాలి
ప్రతీ కల నిజం కావాలి.
విద్యతో ఎదిగి ఉన్నత శిఖరాలు చేరి
భారత మాతకు కీర్తి తేవాలి.
– పిల్లల విద్యే ప్రకాశవంతమైన భవిష్యత్తుకు పునాది
– దూపాటి
హరిప్రసాద్
షాపూర్ నగర్,
హైదరాబాద్.


