పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషించాలి | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషించాలి

Jun 3 2026 11:56 PM | Updated on Jun 3 2026 11:56 PM

సిరిసిల్ల అర్బన్‌: పర్యావరణ పరిరక్షణలో యువత కీలక పాత్ర పోషించాలని జేఎన్‌టీయూ–యూసీఈఆర్‌ ప్రిన్సిపాల్‌ అన్నారు. బుధవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిరిసిల్లలో విద్యార్థులకు పర్యావరణ అంశాలపై అవగాహన కల్పించేందుకు పర్యావరణ క్విజ్‌ పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంస పత్రాలు అందజేశారు. నోడల్‌ అధికారి, ప్రిన్సిపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

పర్యావరణంపై అవగాహన

వేములవాడఅర్బన్‌: అగ్రహారంలోని జేఎన్‌టీయూ యూనివర్సిటీ కళాశాల ఆఫ్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులకు పర్యావరణ అంశాలపై అవగాహన కల్పించేందుకు పర్యావరణ క్విజ్‌ పోటీ నిర్వహించి ప్రశంస పత్రాలు అందజేసినట్లు ప్రిన్సిపాల్‌ వేణుగోపాల్‌ తెలిపారు. అధ్యాపకులు తదితరులున్నారు.

ఇంధన డిపో సందర్శన

రామగుండం: కుందనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌పీసీఎల్‌) ఇంధన డిపోను రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. అగ్ని ప్రమాదాల నివారణ, భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. డిపో మేనేజర్‌ మనీశ్‌ తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement