సమస్యలు ఆలకించండి | - | Sakshi
Sakshi News home page

సమస్యలు ఆలకించండి

May 19 2026 12:16 AM | Updated on May 19 2026 12:16 AM

● కలెక్టరేట్‌ బాట పట్టిన బాధితులు ● సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవో కార్యాలయాల్లోనూ ప్రజావాణి ● అర్జీలు స్వీకరించిన కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ 11కేవీ విద్యుత్‌ వైరు మార్చండి తప్పుడు పట్టా చేయించుకున్నారు చెరువు హద్దులు ఏర్పాటు చేయాలి గోపాల్‌పల్లెలోనే కొనసాగించాలి

● కలెక్టరేట్‌ బాట పట్టిన బాధితులు ● సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవో కార్యాలయాల్లోనూ ప్రజావాణి ● అర్జీలు స్వీకరించిన కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

సిరిసిల్ల అర్బన్‌: ఎవరి వద్దకు పోయిన పట్టించుకోవడం లేదని.. తమ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌కు విన్నవించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్ర జావాణికి జిల్లా నలుమూలల నుంచి ప్రజ లు తరలివచ్చారు. కలెక్టర్‌ మాట్లాడుతూ సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవో కార్యాలయాల్లోనూ ప్రజావాణి నిర్వహిస్తున్నామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డివిజన్‌ స్థాయిలో నిర్వహించే ప్రజావాణిలో తమ వినతిపత్రాలు ఇవ్వాలని సూచించారు. ప్రజావాణిలో 208 దరఖాస్తులు స్వీకరించారు.

మా ఇంటి పై నుంచి 11 కేవీ విద్యుత్‌ వైరు వెళ్తోంది. వైర్లు అంటుకొని షాట్‌ సర్క్యూట్‌ కావడంతో ఒక్కసారిగా ఇంటిపై వైరు పడింది. ఆ సమయంలో ఎవరం బయట లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఆ విద్యుత్‌ వైరును ఇంటి పై నుంచి పక్కకు మార్చాలి.

– జి.బాలయ్య, తుర్కపల్లి

నా భర్త జూలూరి బుచ్చయ్య. నాకు పిల్లల లేరు. నా భర్త రెండో పెళ్లి చేసుకొని నలుగురు పిల్లలకు తండ్రి అయ్యాడు. నా పేరు మీద ఉన్న 3.17 ఎకరాల భూమిని త ప్పుడు విధానాలతో నా భర్త రెండో భార్య పిల్లలు వారి పేరుమీదికి పట్టా చేయించుకున్నారు. ఇప్పు డు నన్ను పట్టించుకోవడం లేదు. నా పేరు మీద ఉన్న భూమిని ఇప్పించి, వారిపై చర్యలు తీసుకో వాలి. – జూలూరి మల్లవ్వ, సముద్రలింగాపూర్‌

తంగళ్లపల్లి మండలం కస్బెకట్కూర్‌లో సాగ్‌ చెరువు కబ్జాకు గురైంది. ఆ చెరువును సర్వే చేయించి హద్దులు ఏర్పాటు చేయాలి. ఆ చెరువులో కస్బెకట్కూర్‌ పరిధిలోని చింతలపల్లి గ్రామస్తులు ధాన్యం ఆరబెట్టుకునేవారు. ఇప్పటికై నా సాగ్‌ చెరువుకు హద్దులు ఏర్పాటు చేసి కబ్జాదారుల నుంచి చెరువును కాపాడాలి.

– కస్బెకట్కూర్‌, గ్రామస్తులు

ముస్తాబాద్‌ మండలం గోపాల్‌పల్లెలోని గ్రామ పంచాయతీని సర్పంచ్‌ ఏకపక్ష నిర్ణయంతో తండాకు తీసుకుపోయారు. సర్పంచ్‌ భర్త ఆధిపత్యం చేస్తూ అధికారులను ఇబ్బంది పెడుతున్నాడు. సర్పంచ్‌ భర్తపై చర్యలు తీసుకోవాలి. – గోపాల్‌పల్లె గ్రామస్తులు

Advertisement
 
Advertisement
Advertisement