● ఉదయం 11.10 గంటలు అయినా రాని అధికారులు
సిరిసిల్ల: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజవాణికి దరఖాస్తులు స్వీకరించేందుకు ఒక్క అధికారి కూడా రాకపోవడంతో వేదికపై కుర్చీలు ఖాళీగా కనిపించాయి. ఉదయం 11.10 గంటల వరకు ఒక్క అధికారి కూడా హాజరుకాలేదు. బాధితులు క్యూలైన్‌లోనే ఎదురుచూశారు. కలెక్టర్ గరీమా అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ తదితరులు ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష సమావేశంలో ఉన్నట్లు తెలిసింది. సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వారి ఆఫీస్‌లలో ప్రజావాణి నిర్వహించారు. దీంతో కలెక్టరేట్‌లో ఒక్క అధికారి కూడా లేరు. ఉదయం 11.10 గంటల తరువాత సీపీవో శ్రీనివాసాచారి, కలెక్టరేట్ ఏవో రాంరెడ్డి దరఖాస్తులు స్వీకరించారు. కొద్దిసేపటికి కలెక్టర్ గరీమా అగ్రవాల్, అదనపు కలెక్టర్ నగేశ్, డీఆర్‌డీవోలు దరఖాస్తులు స్వీకరించారు.


