సిరిసిల్ల: జిల్లా కేంద్రంలో సోమవారం బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు వేర్వేరుగా ధర్నా చేసేందుకు ప్రయత్నించగా పరిస్థితులు చేయి దాటి పరస్పరం దాడులకు దారితీసింది. ధర్నాకు బీజేపీకి అంబేడ్క ర్ సర్కిల్, బీఆర్‌ఎస్‌కు నేతన్నచౌక్ వద్ద అనుమతించినట్లు సమాచారం. ఆ రెండు పార్టీల నాయకులు నేతన్నచౌక్ వద్ద తోపుకోవడంతో పరిస్థితి అదు పు తప్పింది. ఎస్పీ మహేశ్ బీ గీతే, డీఎస్పీ నాగేంద్రచా రి ఇరువర్గాలను ఒప్పించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించక పోలీసులు లాఠీలు ఝుళిపించారు.
తెలంగాణ భవన్ వద్ద రోడ్డెక్కిన బీఆర్‌ఎస్
తెలంగాణ భవన్ వద్ద బీఆర్‌ఎస్ నాయకులు రోడ్డెక్కారు. భారీ ఫ్లెక్సీతో బైఠాయించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మంత్రి పదవికి సంజయ్ రాజీ నామా చేయాలని నినాదాలు చేశారు. సిరిసిల్ల డీ ఎస్పీ నాగేంద్రచారి, ఎస్‌బీ డీఎస్పీ వెంకటేశ్వర్లు రో డ్డుపై బైఠాయించిన వారిని పక్కకు తప్పించి, కొందరిని తంగళ్లపల్లి ఠాణాకు తరలించారు. బీఆర్‌ఎస్, బీజేపీ నేతలపై కేసులు నమోదు చేశారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు : డీఎస్పీ
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్ప వని డీఎస్పీ నాగేంద్రచారి హెచ్చరించారు. జిల్లాలో మే 31 వరకు పోలీస్ యాక్ట్ 1861 అమలులో ఉంటుందని ప్రకటించారు. పోలీసుల అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహించరాదని స్పష్టం చేశారు.
‘బీజేపీ గుండాయిజం నడవదు’
బీజేపీ గుండాయిజం నడవదని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య హెచ్చరించారు. తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలని కోరారు. పోలీసుల లాఠీచార్జీలో తమ కార్యకర్తలు కమలాకర్‌రెడ్డి, రవి గాయపడ్డారని తెలిపారు. బండి భగీరథ్‌కు శిక్షపడే వరకు పోరాడతామన్నారు. టెస్కాబ్ మాజీ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, నాయకులు గూడూరి ప్రవీణ్, జిందం చక్రపాణి, అగ్గిరాములు, గజభీంకార్ రాజన్న, కుంబాల మల్లారెడ్డి, అంజిరెడ్డి, చీటి లక్ష్మణ్‌రావు, కోడి అంతయ్య, మెంగని మనోహర్ పాల్గొన్నారు.
‘ఏకపక్షంగా పోలీసులు లాఠీచార్జీ చేశారు’
శాంతియుతంగా ధర్నాకు వస్తున్న తమ కార్యకర్తలపై పోలీసులు ఏకపక్షంగా లాఠీచార్జీ చేశారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. గతంలో మంత్రి కేటీఆర్ బినామీ సంస్థ గ్లోబరీనా నిర్వాకంతో 29 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. దీనికి బాధ్యత వహిస్తూ కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ర్యాలీగా వస్తున్న బీజేపీ నాయకులు
నినాదాలు చేస్తున్న బీఆర్‌ఎస్ నాయకులు


