చార్‌ధామ్‌ యాత్రికులు వైద్యపరీక్షలు చేయించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

చార్‌ధామ్‌ యాత్రికులు వైద్యపరీక్షలు చేయించుకోవాలి

Apr 28 2026 8:58 AM | Updated on Apr 28 2026 8:58 AM

చార్‌ధామ్‌ యాత్రికులు వైద్యపరీక్షలు చేయించుకోవాలి ఎరువుల దుకాణాల బంద్‌ క్రీడా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి కనగర్తిలో మద్యపాన నిషేధం

సిరిసిల్ల: జిల్లా నుంచి ఉత్తరాఖంఢ్‌లోని చార్‌ధామ్‌కు వెళ్లే యాత్రికులు వైద్యపరీక్షలు చేయించుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఎస్‌.రజిత కోరారు. ఉత్తరాఖంఢ్‌ పర్వత ప్రాంతాలు కావడంతో విపరీతమైన చలి ఉంటుందని, ఆక్సిజన్‌ పూర్తి స్థాయిలో అందక శ్వాసక్రియలో ఇబ్బంది ఏర్పడుతుందని తెలిపారు. విపరీతమైన చలిగాలి, మంచు వర్షాలతో అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంటుందన్నారు. శ్వాసక్రియలో భాగంగా గాలి బాగా పీల్చి, వదలడం కనీసం నిత్యం 5–10 నిమిషాలు వ్యాయామం చేయాలని, కనీసం 30 నిముషాలు నడవాలని, రెండు లీటర్ల తాగునీటిని వెంట ఉంచుకోవాలని సూచించారు. 60 ఏళ్లు పైబడిన వారు, బీపీ, షుగర్‌, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు డాక్టర్‌ సలహా మేరకే చార్‌ధామ్‌యాత్రకు వెళ్లాలని స్పష్టం చేశారు.

కోనరావుపేట(వేములవాడ): తెలంగాణ రాష్ట్ర ఫర్టిలైజర్‌ అసోసియేషన్‌ పిలుపు మేరకు సోమవారం మండల వ్యాప్తంగా ఎరువుల దుకాణా లు పూర్తిగా మూసివేశారు. ఫర్టిలైజర్‌, పెస్టిసైడ్స్‌, సీడ్స్‌ డీలర్ల సమస్యల పరిష్కారం కోసం ఈ బంద్‌ నిర్వహించినట్లు కోనరావుపే ట మండల ఫర్టిలైజర్‌ అసోసియేషన్‌ అధ్యక్షు డు శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మండలంలో డీలర్లతో కలిసి బైక్‌ ర్యాలీ తీశారు.

సిరిసిల్ల అర్బన్‌: గ్రామీణ ప్రాంతాల్లోని 10 కేంద్రాలు, రాజీవ్‌నగర్‌ మినీస్టేడియంలో నిర్వహించే ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా యువజన క్రీడలశాఖ అధికారి ఎ.రాందాస్‌ కోరారు. ఈనెల 28 నుంచి జూన్‌ 7 వరకు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 14 ఏళ్లలోపు బాలబాలికలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు 72071 91123, 76809 51259లో సంప్రదించాలని తెలిపారు.

కోనరావుపేట(వేములవాడ): మండలంలోని కనగర్తిలో పంచాయతీ పాలకవర్గం, మహిళా సంఘాల ఆధ్వర్యంలో మద్యపాన నిషేధం అమలు చేయాలని తీర్మానించారు. గ్రామపంచాయతీలో సర్పంచ్‌ మల్యాల స్వామిదాసు ఆధ్వర్యంలో సోమవారం సమావేశమైన పాలకవర్గం సభ్యులు, మహిళా సంఘాల ప్రతినిధులు తీర్మానించారు. ఈమేరకు గ్రామంలోని బెల్ట్‌షాపుల నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. మే 10 నుంచి గ్రామంలో పూర్తిస్థాయి మద్యపాన నిషేధం అమలులోకి వస్తుందని తెలిపారు. మద్యం విక్రయిస్తే రూ.10వేలు జరిమానా, సమాచారం ఇస్తే రూ.5 వేలు నజరానా అందించనున్నట్లు తెలిపారు. ఉపసర్పంచ్‌ వంగపెల్లి శేఖర్‌, కార్యదర్శి కవితారెడ్డి, వీవో అధ్యక్షురాళ్లు బెంద్రపు జ్యోతి, పుట్ట సంపూర్ణ, సీఏ శోభ, సంఘాల ప్రతినిధులు వసంత, లావణ్య పాల్గొన్నారు.

108లో ఈఎంఈ ఉద్యోగాలు

సిరిసిల్లటౌన్‌: జీవీకే ఈఎంఆర్‌ఐ గ్రీన్‌హెల్త్‌ సర్వీసెస్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 108 అత్యవసర అంబులెన్స్‌ సర్వీసుల్లో ఎమర్జెన్సీ మేనేజ్మెంట్‌ ఎగ్జిక్యూటీవ్‌ పోస్టులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈమేరకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా 108 ప్రోగ్రాం మేనేజర్‌ భూమా నాగేందర్‌ సోమవారం ప్రకటనలో తెలిపారు. బీటెక్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసి, సంబంధిత పోస్టులో కనీసం మూడేళ్ల అనుభవంతోపాటు ఆటోమొబైల్‌ రంగంలో పనిచేసిన అనుభవం గల అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, ఒక సెట్‌ జిరాక్స్‌ కాపీతోపాటు, అనుభవ ధ్రువీకరణ పత్రాలతో ఇంటర్వ్యూకు హాజరుకావాలని కోరారు. మే 2వ తేదీ కరీంనగర్‌ గవర్నమెంట్‌ జనరల్‌ ఆస్పత్రిలో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు వివరించారు. పూర్తి వివరాలకు 91007 99699లో సంప్రదించాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement