కలెక్టర్ గరీమా అగ్రవాల్
వివిధ సమస్యలపై 225 దరఖాస్తులు
సిరిసిల్ల అర్బన్: ప్రజావాణికి వచ్చిన అర్జీలను పెండింగ్‌లో పెట్టవద్దని, సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. మొత్తం 225 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు.
వేములవాడ మండలం సంకెపల్లిలో పెండింగ్‌లో ఉన్న 45 ఇండ్లకు నష్టపరిహారంతోపాటు 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు ప్యాకేజీ ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కలెక్టర్ స్పందించి నష్టపరిహారంతోపాటు ప్యాకేజీ ఇప్పించాలి. – సంకెపల్లి గ్రామస్తులు


