● జెండా ఊపిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడఅర్బన్/వేములవాడరూరల్: వేములవాడ నుంచి భద్రాచలం వరకు ఆర్టీసీ బస్సు సర్వీసును సోమవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేతులమీదుగా ప్రారంభించారు. విప్ మాట్లాడు తూ త్వరలోనే బాసరకు బస్సు ప్రారంభించుకోనున్నట్లు తెలిపారు. డిపో మేనేజర్ శ్రీనివాస్, మున్సి పల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్‌చైర్మన్ నరాల శేఖర్, కౌన్సిలర్ ఎలా శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు
మారుపాకలోని రైతువేదికలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు, రైతులకు అవగాహన కార్యక్రమం విప్ ప్రా రంభించి మాట్లాడారు. భూసార పరీక్షలు చేసుకు ని, పంటలు వేసుకోవాలని సూచించారు. డాక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, సాయికుమార్, సునీతాదేవి, మధుకర్‌రావు, సాయికిరణ్ ఉన్నారు.
పేదల సంక్షేమమే లక్ష్యం
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవా డ రూరల్ మండలం పోచెట్టిపల్లిలో ఇందిరమ్మ గృహప్రవేశానికి హాజరై మాట్లాడారు. ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, సర్పంచ్ చింతపంటి మల్లేశం, రూరల్ కాంగ్రెస్ అధ్యక్షుడు వకుళాభరణం శ్రీనివాస్ పాల్గొన్నారు.


